ఫ్యామిలీతో తారక రత్న దిగిన చివరి ఫోటోతో అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!

నందమూరి తారక రత్న ఇకలేరు అనే మాట అబద్ధం అయితే బాగుండు అనుకుంటున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు.. పార్టీ వర్గాల వారు.. చికిత్స పొందుతున్న తారక్ తిరిగి వస్తాడనే ఆశతో.. నమ్మకంతో చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించలేదు.. 23 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన శివరాత్రి నాడు శివైక్యం చెందారు.. భర్తను పోగొట్టుకున్న భార్య అలేఖ్య రెడ్డి బాధ వర్ణనాతీతం..

ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.. అయిన వాళ్లందర్నీ వదిలేసి తన కోసం వచ్చిన తారక రత్న ఇప్పుడు తనను, ముగ్గురు పిల్లల్ని అనాధలను చేసి.. ఎవరికీ కనిపించనంత దూరం వెళ్లిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్నారామె.. తమ బంధం మొదలైనప్పటి నుండి ఇంత దూరం రావడానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో చెప్తూ పోస్ట్ చేసిన అలేఖ్య.. ఇప్పుడు మరో ఎమోషనల్ పోస్ట్ చేశారు..

తారక రత్న ఫ్యామిలీతో కలిసి తిరుపతిలో తీసుకున్న చివరి ఫోటోను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు అలేఖ్య రెడ్డి.. రెండో పాప రేయా, బాబు తనయ్ రామ్ పుట్టెంట్రుకల కార్యక్రమం తర్వాత వారు దిగిన పిక్ ఇది.. ‘‘ఇదే మేం ఆయనతో దిగిన చివరి ఫోటో.. ఇదే ఆయనతో మా చివరి ట్రిప్.. ఇవన్నీ నిజమని నమ్మాలంటే నా గుండె బద్దలవుతోంది.. ఇదంతా నిజం కాదు.. కల కావాలని కోరుకుంటున్నా.. నన్ను రోజూ ‘అమ్మా బంగారూ’ అంటూ పిలిచే నీ గొంతు వింటూ లేవాలని ఉంది’’ అంటూ కంటతడి పెట్టించే పోస్ట్ చేశారు అలేఖ్య.. ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు.. ధైర్యంగా ఉండాలంటూ మోటివేట్ చేస్తున్నారు..

కాగా తారక రత్న పెద్ద కర్మను 13వ రోజు అంటే.. మార్చి 2వ తేదీన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) లో జరుపనున్నారు.. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారంలో పాల్గొని.. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని ప్రణాళిక వేసుకున్న తారక రత్న 39 ఏళ్ల వయసులో కన్నుమూయడం బాధాకరం.. ఆయన మరణంతో నందమూరి కుటుంబం ఇంకా షాక్‌లోనే ఉంది.. ఫ్యాన్స్.. ఆయన మరణించినప్పటినుండి తనతో వారికున్న మెమరీస్ అన్నిటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus