Alekhya Reddy: నాకున్నది నువ్వు మాత్రమే… నువ్వే నా ప్రపంచం!

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించడంతో మార్చి రెండవ తేదీన పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని ఎంతగానో కుమిలిపోయారు. ఇక తారకరత్న పెద్దకర్మ సందర్భంగా అలేఖ్యరెడ్డి తన భర్త తనకు రాసిన లవ్ లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తారకరత్నకు అలేఖ్య రెడ్డి అంటే ఎంత ప్రేమనో అర్థం అవుతుంది. ఈ సందర్భంగా తారకరత్న తనకు ప్రేమించడం తెలియదంటూనే తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ లేఖలో తారకరత్న నాకున్నది నువ్వు మాత్రమే… నువ్వేనా ప్రపంచం బంగారు తల్లి అంటూ అలేఖ్య రెడ్డి పై ఉన్న ప్రేమను తెలియజేశారు. ముందుగా తన భార్యకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అలేఖ్య పై ఉన్న ప్రేమను తెలిపారు. ఈ లవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసినటువంటి అభిమానులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

అలేఖ్య ఈ లవ్ లెటర్ ని షేర్ చేస్తూ మరొక ఎమోషనల్ పోస్ట్ చేశారు. మనం మన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను, ఇబ్బందులను, క్లిష్ట పరిస్థితులను చూసాం.అయినప్పటికీ నువ్వు నేను కలిసి ఇంత దూరం ప్రయాణం చేసాము. మన జీవితంలో మనం చాలా దూరం వచ్చేసాం. మనకోసం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం అసలు నువ్వు ఏంటో ఎవరికి తెలియదు.

నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు చాలా అదృష్టవంతురాలిని కానీ నువ్వు నా నుంచి వెళ్ళిపోవడం నిజంగా దురదృష్టం.ఎన్ని బాధలు వచ్చినా అన్ని నీలోనే దాచుకొని ప్రేమను మాత్రమే మాకు పంచావు నేను ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా వాటిని నమ్మను మరింత ఎత్తుకు ఎదుగుతాను అంటూ ఈమె తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus