Arya Movie: అల్లు అర్జున్ ‘ఆర్య’ చేయడం వెనుక తరుణ్ కారణమా.. ఎలా?

ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ ని  (Tarun)  అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఇతను ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమానే ‘నువ్వే కావాలి’. ఆ తర్వాత కూడా తరుణ్ ‘ప్రియమైన నీకు’ ‘నువ్వు లేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే ఆ తర్వాత ఎందుకో అతని కెరీర్ స్లో అయ్యింది. ‘నవ వసంతం’ వంటి సినిమాలు ఓకే అనిపించినా.. తిరిగి ఫామ్లోకి రాలేకపోయాడు.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. తరుణ్ కి ‘ఆర్య’ (Aarya) సినిమాకి ఓ లింక్ ఉంది. ‘ఆర్య’ వంటి కల్ట్ సినిమా అల్లు అర్జున్ (Allu Arjun) చేయడానికి పరోక్షంగా తరుణ్ కూడా కారణమయ్యాడు. అదెలా అంటే..! ‘దిల్’ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన రోజులవి. ఈ క్రమంలో తరుణ్ తో పాటు ఇంకొంతమంది యంగ్ హీరోలు ఆ సినిమా చూస్తామంటే నిర్మాత దిల్ రాజు (Dil Raju)  ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఆ షోకి తరుణ్.. అల్లు అర్జున్ ని ఇన్వైట్ చేశాడట.

దీంతో ఆ సినిమా చూడటానికి వెళ్లిన అల్లు అర్జున్ … నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సుకుమార్ (Sukumar)  కంట్లో పడ్డాడు. వాళ్ళ ‘ఆర్య’ కథకి ముందుగా ప్రభాస్ (Prabhas) , రవితేజ(Ravi Teja), నితిన్ (Nithin) వంటి హీరోలని అప్రోచ్ అవ్వడం…వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఆ టైంలో హీరోని వెతికే పనిలో ఉన్నారు దిల్ రాజు, సుకుమార్..లు! అలాంటి టైంలో అల్లు అర్జున్ ని చూసిన ఆ ఇద్దరూ.. తమ కథకి ఇతనే కరెక్ట్ అని భావించి అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలా ‘ఆర్య’ అల్లు అర్జున్ కి సెట్ అయ్యింది.

నిన్న జరిగిన ‘ఆర్య’ 20 ఏళ్ళ సెలబ్రేషన్ వేడుకలో కూడా అల్లు అర్జున్ ‘తరుణ్ నాకు మంచి స్నేహితుడు’ అంటూ ప్రస్తావించాడు. ‘ఆర్య’ తనకు సెట్ అవ్వడం వెనుక తరుణ్ హస్తం కూడా ఉందనే విషయాన్ని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు మొన్నామధ్య ‘ఆహా’ లో విడుదల చేసిన ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)  సినిమాకి తరుణ్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. దీంతో అల్లు ఫ్యామిలీతో తరుణ్ కి మంచి అనుబంధం ఉంది అని స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus