విడుదల విషయంలో వాదులాడుకొంటున్న విజయ్-వంశీ

ప్రస్తుతం మోస్ట్ ఫేవరెట్ హీరో ఆఫ్ టాలీవుడ్ ఎవరా అని అడిగితే ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా టక్కున చెప్పే పేరు “విజయ్ దేవరకొండ”. వరుస విజయాలతో సూపర్ స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండకు ఇప్పుడున్నంత క్రేజ్ మన స్టార్ హీరోలకు కూడా లేదు. అలాంటి విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా విడుదల విషయంలో మాత్రం ఎందుకో తెలియని కన్ఫ్యూజన్ చోటు చేసుకొంది. నిజానికి ప్రస్తుతం విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ & క్రేజ్ కి అతడి సినిమా ఫ్లాపైనా కూడా లాభాలోచ్చేస్తాయి. కానీ.. విజయ్ నటించిన “ట్యాక్సీవాలా” సినిమా విడుదలలో మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయి.

యువీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వంశీకి “ట్యాక్సీవాలా” అవుట్ పుట్ సరిగా నచ్చక ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ దర్శకుడు రాహుల్ ఏమో ఇంత కష్టపడి, ఇంతలా వెయిట్ చేసినందుకు థియేటర్ రిలీజ్ ఉండాలి కానీ.. సింపుల్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం ఏంటీ అని కోప్పడుతున్నాడట. కానీ.. విజయ్ మాత్రం “ట్యాక్సీ వాలా” చిత్రాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన తదుపరి చిత్రమైన “నోటా” సినిమాపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. “ట్యాక్సీవాలా” కంటే ముందు “నోటా”ను విడుదల చేయాలనుకొంటున్నాడట. మరి ఈ కన్ఫ్యూజన్ కి తెరపడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus