ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సాహో టీం సన్నాహాలు

సినిమా బాగా వచ్చిందా, సినిమాకి ఎంతమంది పని చేశారు, సినిమా బడ్జెట్ ఎంత అనే విషయాలంటే.. సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు? అనే విషయాన్ని మాత్రమే ఏ హీరో అభిమానులైనా కాస్త సీరియస్ గా తీసుకొంటారు. అందుకే.. “సాహో” సృష్టికర్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ల దిల్ ఖుష్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన టీజర్, ప్రోమోస్ మరియు ఫస్ట్ సింగిల్ “సైకో సయ్యాన్” ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగానే అలరించినప్పటికీ.. ఎందుకో ఫ్యాన్స్ మాత్రం ‘సాహో” ప్రమోషన్స్ విషయంలో పూర్తిస్థాయిలో సంతోషంగా లేరు.

వీరి అసహనం పోగొట్టడానికి సన్నద్ధమవుతున్నారు సాహో మేకర్స్. అందుకే.. మునుపెన్నడూ టాలీవుడ్లో కానీ మరెక్కడా కానీ నిర్వహించనంత ఘనంగా “సాహో” ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించబోయే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. అలాగే.. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సో, ఈ ప్రభాస్ ఫ్యాన్స్ రియల్ పండగ ఎప్పుడు, ఎక్కడ అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus