బిగ్ బాస్ హౌస్ నుంచీ అనూహ్యంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి టేస్టే తేజకి ఓటింగ్ లో పర్సెంటేజ్ బాగానే ఉంది. అయినా కూడా డేంజర్ జోన్ లో ఉన్నా తర్వాత పిక్ అప్ అయ్యాడు. కానీ, శోభాని కాపాడేందుకు తేజని ఎలిమినేట్ చేశారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి తేజ, శోభాకంటే కూడా ఎక్కువే ఓట్లు తెచ్చుకున్నాడు. శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇంట్లో శోభాశెట్టి వెళ్లిపోతే కంటెంట్ జనరేట్ చేసేవాళ్లు ఉండరు. అందుకే ఈ ఒక్క రీజన్ తోనే తేజని ఎలిమినేట్ చేశారనే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ.
అయితే, ఫస్ట్ నుంచీ కూడా టేస్టీతేజ గేమ్ అనేది అంత పెద్దగా ఆకట్టుకోలేదు. అంతేకాదు, ఏ గ్రూప్ లోనూ లేకుండా నేను న్యూట్రల్, ఎంటర్ టన్మెంట్ ఇస్తున్నాననే అనుకున్నాడు. కానీ, హౌస్ మేట్స్ మాత్రం చాలా కన్నింగ్ గా గేమ్ ఆడుతున్నారని అన్నారు. అనుకున్నారు కూడా. అందుకే, టేస్టీ తేజ నామినేషన్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండేవారు. ప్రతి వారం తేజ ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్లు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. లాస్ట్ వీక్ సందీప్ మాస్టర్ ని కూడా తేజనే నామినేట్ చేశాడు. అయితే, ఇప్పుడు తేజనే ఎలిమినేట్ అయ్యాడు. అసలు తేజ ఎలిమినేషన్ కి మనం కొన్ని కారణాలు చూసినట్లయితే.,
నెంబర్ 1
టేస్టీ తేజ మూడోవారమే ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నాడు. అప్పుడు బ్రతికిపోయాడు. ఇన్నాళ్లు ఉన్నాడంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. తన గేమ్ తోనే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంటూ వచ్చాడే తప్ప తనకంటూ ఫస్ట్ నుంచీ కూడా సోషల్ మీడియాలో హ్యూజ్ గా ఓటింగ్ అనేది జరగలేదు. అదే తేజకి ప్లస్ అయ్యింది. మైనస్ కూడా అయ్యింది. టేస్టీ తేజని సేఫ్ చేద్దామని ఏ ఒక్కరూ కూడా అనుకోలేదు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.
నెంబర్ 2
ఎప్పటి కప్పుడు తన గేమ్ ని తానే డౌన్ చేసుకున్నాడు. సీరియస్ పాయింట్ ని కూడా ఫన్ మోడ్ లో చెప్పేసరికి హౌస్ మేట్స్ కి కొద్దిగా చులకన అయ్యాడు. అందుకే, తేజ మాటలని సీరియస్ గా తీస్కోలేకపోయారు. అంతేకాదు, స్ట్రాటజీలు తనవైనా సరే , గేమ్ ప్లాన్ తనదైనా సరే నేను చేశా అనేది సీరియస్ గా కాకుండా సరదాగా చెప్పేసరికి ఆడియన్స్ కి ఎక్కలేదు.
నెంబర్ 3
నామినేషన్స్ లో ఎప్పటికప్పుడు పాయింట్స్ ని చెప్పలేకపోయాడు. వీకెండ్ నాగార్జున ఇచ్చిన ఇన్ పుట్స్ ని వాడుకున్నా లేదా తన – మన భేదం లేకుండా నేను నామినేషన్స్ చేస్తాననే సూటిగా గేమ్ ఆడినా కూడా , తేజ టాప్ 5కి వెళ్లేవాడు. ఎక్కడా కూడా తేజ గేమ్ సూటిగా లేదు.అందుకే, నిలకడగా తనకి ఫాలోవర్స్ రాలేకపోయారు.
నెంబర్ 4
యావర్, గౌతమ్, అర్జున్, సందీప్, అమర్ , ప్రశాంత్, ఇలా ఎవరితోనూ ఫిజికల్ టాస్క్ ఆడేందుకు తేజ సరిపోలేదు. ఆ అవకాశం కూడా తనకి రాలేదు. ఫస్ట్ లో చాలామంది తేజని ఇదే కారణంగా నామినేట్ కూడా చేశారు. నీ గేమ్ లో 100శాతం ఇవ్వలేదని అన్నారు. దానికి తేజ కౌంటర్ వేసినా కూడా మంచి టాస్క్ ఆడిందంటూ ఏదీ లేదు. అంతేకాదు, ఫోటో టాస్క్ లో గౌతమ్ మెడకి బెల్ట్ వేసి లాగింది తేజ ఆటకి మైనస్ అయ్యింది. అక్కడ్నుంచీ తేజ టాస్క్ లలో కాస్త డౌన్ అయ్యాడు.
నెంబర్ 5
ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకునే టెక్నిక్ ని తేజ పట్టుకోలేకపోయాడు. చాలావారాలు శోభాశెట్టితోనే ఉన్నాడు. శోభతో కలిసి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈవిషయం శివాజీ లాస్ట్ వీక్ చెప్పాడు కూడా. ఒకరితోనే ఉండద్దు.. బెడిసి కొడుతుంది.. గేమ్ పక్కకి వెళ్తుందని చెప్పాడు. అయినా కూడా తేజ వినలేదు. అంతేకాదు, శోభతో తేజతో బిగ్ బాస్ కూడా కంటెంట్ ఇస్తూ ట్యాటూ గేమ్ ఆడాడు. దీనివల్ల ఎంటర్ టైన్మెంట్ రాలేదు.
అంతేకాదు, తనకోసం వచ్చిన కేక్ విషయంలో కూడా తేజ విఫలం అయ్యాడు. ఇలా (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ చేసిన ఫన్ తనకి ప్లస్ అవుతుందని ఆటని ముందుకు తీస్కెళ్తున్నాని అనుకున్నాడు. కానీ, బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేస్తూనే గేమ్ పరంగా కూడా హెచ్చరించాడని తెలుసుకోలేకపోయాడు. తేజ గేమ్ పరంగా , లాజిక్స్ పరంగా బాగానే వర్కౌట్ చేసినా కూడా తన గ్రాఫ్ ని పెంచుకోలేకపోయాడని అనే చెప్పాలి. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!