‘జాంబీ రెడ్డి’ గురించి తేజ ఆసక్తికరమైన కామెంట్లు..!

గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘చూడాలని ఉంది’ ‘కలిసుందాం రా’, ‘ఇంద్ర’ ‘గంగోత్రి’ ‘ఛత్రపతి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన తేజ.. ఈ మధ్యకాలంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తేజ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన సంగతులను చెప్పుకొచ్చాడు.

తేజ మాట్లాడుతూ.. ” ‘జాంబీ రెడ్డి’ కథ గురించి రవితేజ, సమంతలతో కూడా డిస్కస్‌ చేశాను. వారితో పాటు మరికొందరు దర్శకనిర్మాతలకు కూడా చెప్పాను. కడప, కర్నూలులో జాంబీలు అని చెప్పగానే అందరికీ విపరీతంగా నచ్చేసింది.కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టాలని ఓ సైంటిస్ట్‌ ప్రయత్నించగా…అది వికటించి జాంబీ అవుతాడు. ఈ వైరస్‌ జనాల్లోకి ఎలా వెళ్లింది? తర్వాత ఏమైంది? అనేది మిగిలిన కథ. పక్కా కమర్షియల్‌ హంగులతో కూడుకున్న కామెడీ సినిమా ఇది.

అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో నా పేరు మ్యారియో. కథ ప్రకారం ఓ గేమ్‌ డిజైనర్ పాత్ర అది‌. సినిమాలో నాకేమి లవ్‌ ట్రాక్‌ లేదు” అంటూ చెప్పుకొచ్చిన తేజ.. తన తరువాతి ప్రాజెక్టుల పై కూడా స్పందించాడు. ప్రస్తుతం తేజ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్లో ‘ఇష్క్‌’ అనే సినిమా చేస్తున్నాడట. ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్న మరో ఫాంటసీ లవ్‌స్టోరీలో కూడా తేజ నటిస్తున్నాడట. దానికి ‘అద్భుతం’ టైటిల్‌ ను అనుకుంటున్నట్టు తేజ తెలిపాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus