సినిమాల్లో ఎన్టీవోడిని చూసి కృష్ణుడు, రాముడు అని అనుకునేవారట ఆ రోజుల్లో. ఆయన బయట కనిపిస్తే రెండు చేతులు ఎత్తి దేవుణ్ని కొలిచినట్లే కొలిచేసేవారట. అంతలా ఆయన ఆ పాత్రల్లో జీవించారు అని చెబుతారు. ఆయనే కాదు ఆ తర్వాత దేవుని పాత్రలు పోషించిన వాళ్లందరికీ అలాంటి రెస్పాన్సే వచ్చేది. ఇటీవల కాలంలో ఇలాంటి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి రావడం తగ్గిపోయింది. అయితే తాజా యువ హీరో తేజ సజ్జాకు (Teja Sajja) అదే జరిగింది.
Teja Sajja
గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకకు తేజ సజ్జా ఓ అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆయన స్టేజీ మీదకు రాగానే.. ఒక పెద్దాయన అతడికి పాదాభివందనం చేశాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎందుకలా చేశారు అని తెలియాలంటే.. తేజ గత చిత్రం గుర్త చేసుకోవాలి. ‘హను – మాన్’ (Hanu Man) తేజ కాసేపు హనుమంతుడిగా కనిపిస్తాడు. ఆ ఎఫెక్టే పెద్దాయనతో అలా చేయించింది అని చెప్పాలి.
ఊహించని పరిణామానికి ఆశ్చర్యపోయిన తేజ.. ఆ పెద్దాయన్ని వారించే ప్రయత్నం చేశాడు. పురాణ పురుషుల పాత్రలతో మంచి సినిమా పడితే ప్రేక్షకుల మీద ఏ స్థాయి ఇంపాక్ట్ ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు. నటుల్ని ఆ పాత్రల్లో చేసి ప్రేక్షకుల మైమరచిపోతారు. దాంతో ఇలాంటివి చేస్తారు. అంతేకాదు విలన్లను చూసి తిట్టుకునేవాళ్లు కూడా ఉంటారు.
ఈ మధ్యే హఠాత్తుగా చనిపోయిన తమిళ నటుడు డేనియల్ బాలాజీ తొలినాళ్లలో కమల్ హాసన్ ‘వేట్టయాడు విలయాడు’లో విలన్‌గా నటించాడు. ఆ సినిమా తర్వాత ఆయన ఓసారి ఓ మాల్‌కి వెళ్లినప్పుడు లిఫ్ట్‌లో అతణ్ని చూసిన అమ్మాయిలు బెంబేలెత్తి పరుగెత్తారట. ఇక మన అందరి ఫేవరెట్ సూర్య కాంతాన్ని సినిమాల్లో గయ్యాళిగా చూసి బయట చూసేవాళ్లు ‘కోడలిని అలా ఎందుకు రాచి రంపాన పెడుతున్నావమ్మా’ అని అడిగేవారట. ఇదంతా సినిమాల ఎఫెక్ట్. సినిమాలో జీవించిన నటుల ఎఫెక్ట్.