బాల నటుడిగా సినిమా రంగంలోకి వచ్చిన వాళ్లు హీరోగా సక్సెస్ సాధించడం సులువు కాదు. అయితే తేజ సజ్జా మాత్రం బాలనటుడిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు హీరోగా కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించారు. చూడాలని ఉంది అనే సినిమాతో తేజ సజ్జా సినీ కెరీర్ మొదలైంది. ఈ సినిమాకు తేజ సజ్జా కేవలం 5000 రూపాయల పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది. ఆ తర్వాత సినిమా సినిమాకు తేజ సజ్జా పారితోషికం అంతకంతకూ పెరిగింది.
హనుమాన్ సినిమాకు తేజ సజ్జా కోటి రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. 5000 రూపాయల నుంచి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి తేజ సజ్జా ఎదగడం అంటే సాధారణ విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ రిలీజ్ కావడం వల్ల కొంతమంది నా గురించి నెగిటివ్ గా ఆలోచిస్తున్నారని తేజ సజ్జా పేర్కొన్నారు.
సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనేది నా చేతిలో లేదని మహేశ్ తో పోటీ అంటూ వస్తున్న వార్తలు కామెడీగా ఉన్నాయని తేజ సజ్జా చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు మహేశ్ బాబు సినిమాల్లో చేశానని మహేశ్ బాబు నన్ను వాళ్ల ఇంట్లో మనిషిగా చూశారని ఆయన కామెంట్లు చేశారు. మహేశ్ తో పోటీ పడాలనే ఆలోచన లేదని ప్రేక్షకులను అలరించడమే అంతిమ లక్ష్యమని తేజ సజ్జా పేర్కొన్నారు.
హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని తేజ సజ్జాకు ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ మహిమాన్వితపు బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. హనుమాన్ మూవీ కర్ణాటక, తమిళనాడు హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. హనుమాన్ మూవీ ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.