Teja Sajja: హనుమాన్ కోసం కంటి చూపు కోల్పోయిన తేజ?

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం హనుమన్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల అయినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా భారీ స్థాయిలో రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తేజ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో రోకలి బండతో కొట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి అయితే ఈ సన్నివేశాలు చేస్తున్నట్టు సమయంలో ఆయన మీద పూర్తిగా పట్టేసిందని తదుపరి రోజు షూటింగ్లో పాల్గొనడానికి కూడా వీలు కాలేయకుండా పోయిందని తెలిపారు. ఇక ఆంజనేయ స్వామి శక్తులు వచ్చినప్పుడు గాలిలో తేలుతూ ఉండే సన్నివేశాలను కూడా చాలా కష్టపడి తీశామని తెలిపారు. ఈ సన్నివేశం కోసం దాదాపు 6 గంటల పాటు నేను గాలిలో తాళ్ల సహాయంతో వేలాడుతూనే ఉన్నానని తేజ వెల్లడించారు.

అలాగే క్లైమాక్స్ దాదాపు 40 రోజులపాటు షూటింగ్ చేశాము ఈ సన్నివేశాలు షూట్ చేసే సమయంలో ఎక్కువగా దుమ్ము, పొగ రావడంతో తన కంటి చూపు పూర్తిగా దెబ్బ తినిందని కుడి కన్ను అసలు కనిపించడం లేదని తెలిపారు. డాక్టర్ల వద్దకు వెళ్తే వెంటనే సర్జరీ చేయాలని కూడా చెప్పారు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని తేజ తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం తేజ ఇంత కష్టం పడ్డారా ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసినదే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus