Teja Sajja: మరో పెద్ద బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన ‘జాంబీ రెడ్డి’ హీరో తేజ..!

‘రాజకుమారుడు’ ‘కలిసుందాం రా’ ‘ఇంద్ర’ ‘గంగోత్రి’ ‘ఠాగూర్’ ‘ఛత్రపతి’ శ్రీరామదాసు’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ ఇప్పుడు హీరోగా కూడా మారిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తేజ.. అటు తరువాత ‘జాంబీ రెడ్డి’ చిత్రంతో హీరోగా మారాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తేజ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందనుంది.

ఇదిలా ఉండగా… తేజ తక్కువ టైంలోనే తన రెండవ సినిమాని కూడా పూర్తి చేసాడు. అదే ‘ఇష్క్ – ఇత్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’ మూవీ..! ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ‘ఆర్.బి.చౌదరి’ నిర్మించాడు. మే నెలలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. తన తర్వాతి సినిమాల పై కూడా తేజ ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివానితో కలిసి ‘వెన్నెల’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అది షూటింగ్ దశలో ఉండగానే మరో పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడట.

వివరాల్లోకి వెళితే.. ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్లో తేజ ఓ సినిమా చేయడానికి సైన్ చేసాడట.ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి నిర్మించబోయే ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. గతంలో ‘వైజయంతీ మూవీస్’ వారు నిర్మించిన ‘రాజకుమారుడు’ ‘ఇంద్ర’ ‘గంగోత్రి’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు అతని ప్లానింగ్ చూస్తుంటే.. సైలెంట్ గా స్టార్ అయిపోయేలా కనిపిస్తున్నాడనే చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus