తెలుగుల సినిమాల్లో బాలనటులుగా చేసి, హీరోగా ఎంట్రీ ఇచ్చినవాళ్లు పెద్ద ఎక్కువగా ఉండరు. కారణాలు తెలియదు కానీ, అలా కనిపించేవాళ్లు చాలా తక్కువ. ఇటీవల అలా వచ్చిన కథానాయకుడు తేజ సజ్జా. ‘జాంబీ రెడ్డి’తో కథానాయకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. అంతకుముందు బాలనటుడిగా 50 సినిమాలకుపైగా నటించాడు. దీంతో హీరో అవకాశం చాలా సులభంగా వచ్చేసింది అనుకుంటారేమో… అవకాశం కోసం తేజ ఐదేళ్లు ఆగాల్సి వచ్చిందట తెలుసా. చిన్నతనం నుండీ సినిమాల్లో ఉన్నాడు కాబట్టి…
పెద్దయ్యాక హీరోగా స్థిరపడటం అనుకున్నంత సులువు కాదని చెబుతున్నాడు తేజ. దాదాపు అయిదేళ్లు అవకాశాల కోసం విశ్వప్రయత్నాలు చేశాడట. కొన్ని సినిమాల్లో సెలెక్ట్ అయ్యి అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రాజెక్టు నిలిచిపోయేదట. ఇలా చాలా సినిమాలకు జరిగిందట. మరికొందరేమో ‘సారీ తేజా’ అంటూ మరొకరిని తమ సినిమా కోసం ఎంపిక చేసేవారట. ఇలా చాలా అవకాశాల్ని పోగొట్టుకున్నాకే ‘జాంబీ రెడ్డి’తో హీరో అయ్యాడట తేజ. ఈ క్రమంలో తన తొలి చిత్రం ‘చూడాలని ఉంది’ రోజుల్ని కూడా తేజ గుర్తు చేసుకున్నాడు.
రెండున్నరేళ్ల వయసులో ఓసారి ఆయన కజిన్ రెస్టరంట్‌కి తీసుకెళ్లాడట. అప్పటికే ‘చూడాలని ఉంది’ కోసం దర్శకుడు గుణశేఖర్ ఓ అబ్బాయిని వెతుకుతున్నారట. అలా ఆ హోటల్‌లో తేజను చూసి గుణశేఖర్ సెలక్ట్ చేసుకున్నారట. అలా ఊహ తెలిసేసరికే నటుడయ్యాడు తేజ ఆ తరువాత ‘ఇంద్ర’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత క్రమంగా బాలనటుడిగా అవకాశాలు పెరిగాయట.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!