తన పెళ్ళి గురించి తేజస్వి కామెంట్స్..!

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘నేను నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీ లో బి.టెక్ చదువుతున్నా’ అనే ఒక్క డైలాగ్ తో అమాంతం ఫేమస్ అయిపొయింది తేజస్వి. అదే ఈమెకు మొదటి చిత్రం. ఆ చిత్రం తర్వాత ఈమెకు ‘హార్ట్ ఎటాక్’ ‘మనం’ ‘ఐస్ క్రీం’ ‘పండగ చేస్కో’ ‘శ్రీమంతుడు’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి మరింత చేరువైంది. ఇంకా అనేక చిన్న సినిమాల్లో కూడా నటించింది. ఇక 2018 లో ‘బిగ్ బాస్ సీజన్ 2’ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..

ఆ షోలో విన్నర్ కౌశల్ ను టార్గెట్ చేసి విమర్శిస్తూ ఉండడంతో.. ఈమెను నెటిజన్లు ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. ఇక అనేక సార్లు ఊరికే నోరు పాడేసుకోవడం కూడా ఈమెకు మైనస్ అయ్యింది. ఓ విధంగా అప్పటివరకూ సంపాదించుకున్న క్రేజ్ అంతా ‘బిగ్ బాస్’ వల్ల పోగొట్టుకుందనే చెప్పొచ్చు. దాంతో తరువాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుంది. అందుకోసం ఓ రేంజ్ లో గ్లామర్ షో కూడా చేసింది.

వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా..! ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఇక లాక్ డౌన్ కారణంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీకి … ‘పెళ్ళి ఎప్పుడు?’ ‘బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఈ అమ్మడు జవాబిస్తూ.. ‘నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇక ఇప్పుడు ఓ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దానికి వ్యాక్సిన్ వచ్చాక పెళ్ళి చేసుకుంటాను’ అంటూ తెలివిగా సమాధానం చెప్పింది.

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus