Tejaswi Madivada: తేజస్వికి కలిసిరాని బిగ్ బాస్..! అసలు కారణాలు ఇవేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అనూహ్యంగా తేజస్వి ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఐదోవారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో బిందుమాధవి అన్ అఫీషియల్ పోలింగ్స్ లో టాప్ లో ఉంటే, తేజస్వి సేఫ్ జోన్ లోనే ఉంది. తేజస్వి కంటే కూడా అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, ఇంకా స్రవంతిలు వెనకబడి ఉన్నారు. కానీ, బిగ్ బాస్ టీమ్ అనూహ్యంగా తేజుని ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి హాట్ స్టార్ లో ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందో ఆడియన్స్ కి చూపించరు.

Click Here To Watch NOW

పబ్లిక్ గా చూపిస్తేనే పబ్లిక్ ఓటింగ్ కి కొద్దిగా గౌరవం ఉంటుందని చాలామంది బిగ్ బాస్ లవర్స్ మొత్తుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు తేజస్వి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఖండిస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి సీజన్ 2 తో పోలిస్తే తేజస్వి గేమ్ బాగా డెవలప్ అయ్యింది. అందరితో మింగిల్ అవుతూ ఆచి తూచి గేమ్ ఆడుతోంది. అయితే, ఈసారి నటరాజ్ మాస్టర్ తో ఉన్న గొడవ వల్ల ఈసారి నామినేషన్స్ లోకి వచ్చింది. అందుకే ఎలిమినేట్ అయ్యింది. నిజానికి తేజుని కేవలం మాస్టర్ మాత్రమే నామినేట్ చేశారు.

కానీ, తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల తేజు బిందుతో స్వాప్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బిందు సేఫ్ అయ్యింది కానీ, తర్వాత రౌండ్ లో మళ్లీ బిందు నామినేట్ అయ్యింది. ఇలా నామినేషన్స్ లో లేకపోయినా కూడా తేజు నామినేట్ అవ్వాల్సి వచ్చింది. కేవలం నటరాజ్ మాస్టర్ ఆడిన పర్సనల్ గేమ్, తీసుకుని సొంత నిర్ణయం వల్లే తేజు ఎలిమినేట్ అయిపోయింది. తేజస్వి గేమ్ పరంగా చూసినా, టాస్క్ ల పరంగా చూసినా గేమ్ చాలా బాగా ఆడింది.

అంతేకాదు, టాస్క్ లలో ఎలా ఆడాలి, ఎంతవరకూ పోరాడాలి అనేది కూడా తేజస్వికి బాగా తెలుసు. కానీ, మొన్న రీసంట్ గా ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ అస్సలు తనకి నచ్చలేదని, తొక్కలా ఉందని కామెంట్స్ చేసింది. మరి ఈ రీజన్ వల్ల బిగ్ బాస్ నిర్వాహకులు ఏమన్నా తేజుని కావాలని ఎలిమినేట్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తేజు ఎలిమినేషన్ పట్ల బిగ్ బాస్ వీక్షకులు చాలా అంసతృప్తితో ఉన్నారు.

ఇది ప్రేక్షకులకే కాకుండా హౌస్ కి కూడా బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ అనేది తేజుకి అంత కలిసిరాలేదు. లాస్ట్ టైమ్ సీజన్ 2 లో కూడా కౌషల్ ఫ్యాన్స్ వల్ల తేజస్వి ట్రోల్ అయ్యింది. అంతేకాదు, అప్పుడు కూడా ఇలా ఐదోవారం, ఆరోవారమే బయటకి వచ్చేసింది తేజస్వి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus