Tejaswi Madivada: కమిట్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తేజస్వి!

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కావడం గమనార్హం. తక్కువ టికెట్ రేట్లతోనే విడుదలైనా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎవరికైనా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైతే ఆ విషయంలో ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు.

ఎవరికైనా అలాంటి అనుభవం ఎదురైతే ఫైట్ చేయాలని లొంగిపోయి మోసం చేశాడని కామెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆమె కామెంట్లు చేశారు. నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. తనను ఇండస్ట్రీలో కమిట్మెంట్లు అడిగారని ఆమె తెలిపారు. ఈవెంట్లకు వెళ్లిన సమయంలో కొంతమంది డ్రింక్ చేసి నన్ను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టేవారని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో నేను ఏడ్చి అక్కడినుంచి బయటపడేదానినని తేజస్వి అన్నారు.

కొంతమంది డైరెక్ట్ గా కమిట్మెంట్ అడుగుతారని మరి కొందరు ఫ్రెండ్ షిప్ చేసి ఫోన్ లో కమిట్మెంట్ అడుగుతారని తేజస్వి చెప్పుకొచ్చారు. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయిలకు ఈ తరహా అనుభవాలు ఎదురవుతూ ఉంటాయని అలాంటి అమ్మాయిలకు కమిట్మెంట్ సినిమా రూల్ బుక్ తరహాలో ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో తేజస్వి ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

తేజస్వికి సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తేజస్వి మదివాడ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించారు. తేజస్వి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus