Tejaswi Madivada: అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన తేజస్వి!

నటి తేజస్వి మదివాడ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అప్పటివరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆమె బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే షో నుండి బయటకు వచ్చిన తరువాత ఆమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. మొన్నామధ్య ‘కమిట్మెంట్’ అనే సినిమాతో రచ్చ చేసింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు.

ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. తన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలే ఈ సినిమాలో ఉన్నాయని.. ప్రతీ ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా అంటూ తేజస్వి సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వి ఇప్పుడు కొత్త అవతారమెత్తారు. నటిగా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా మారినట్లున్నారు. ప్రస్తుతం అనీష్ కురివిల్లా దర్శకత్వంలో రాబోతున్న ఓ వెబ్ సిరీస్ కోసం తేజస్వి సహాయ దర్శకురాలిగా మారారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చారు. నటిగా చేస్తే కేవలం నటన మీదే ధ్యాస ఉంటుందని.. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తే సినిమాకి సంబంధించిన ప్రతి విషయంపై అవగాహన వస్తుందని అన్నారు. నటిగా కంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువ కష్టం, బాధ్యత, పని ఉంటుందని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus