అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil raju)… ‘దిల్ రాజు డ్రీమ్స్’ ని ఏర్పాటు చేశారు. దీని లాంచ్ లో భాగంగా ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి మోసాలు జరుగుతాయో చెప్పి షాకిచ్చారు. ఆయన మాట్లాడుతూ… “సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మోసాలు ఉంటాయి. నిర్మాతలు కావాలనుకునే వారికి రూ.2 కోట్లలో సినిమా చేస్తాం అంటారు.
సినిమా మొదలు పెట్టడానికి వాళ్ళు అలా చెబుతారు. కానీ అది పూర్తయ్యేసరికి రూ.4 కోట్లు అవుతుంది. అప్పుడు ఏమి చేయలేము. అప్పు చేసి తెచ్చి రిస్క్ లో పడిపోతారు. నిర్మాతలు కావాలనుకునే వారికి ‘దిల్ రాజు (Dil raju) డ్రీమ్స్’ లో ట్రైనింగ్ ఇస్తాము. ఏ సినిమాకి ఎంత మార్కెట్ అవుతుంది. ఎంత బడ్జెట్ పెట్టాలి వంటి వాటిపై అందరికీ అవగాహన కల్పిస్తాం” అంటూ చెప్పారు.
అలాగే దిల్ రాజు (Dil raju) మరింతగా మాట్లాడుతూ.. “అలాగే గతంలో దిల్ రాజు శిరీష్- లక్ష్మణ్..లను తీసుకుని ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం డబ్బులు కట్టడానికి వెళ్తే.. ‘అక్కడ మీరు బాగున్నారు. యాక్టింగ్ చేస్తారా?’ అని అడిగారు. అందుకు ఆశ్చర్యపోయి, సంతోష పడి ఓకే అనుకున్నాం. తర్వాత మేము షూటింగ్ కి వెళితే మా బ్యానర్లు పెట్టి వెల్కమ్ చెప్పారు.
కానీ షూటింగ్లో రోజంతా ఉంచి ఒక అమ్మాయితో గంట కొట్టించే సీన్ తీశారు.మమ్మల్ని వాళ్ళు బురిడీ కొట్టించడానికి అలా చేశారని గ్రహించి ‘మాకు సినిమా కంప్లీట్ చేసి ఇవ్వండి.. యాక్టింగ్ వద్దు’ అని చెప్పి వచ్చేశాం” అంటూ చెప్పాడు. ఇలా మనల్ని బురిడీ కొట్టించే జనాలు ఎక్కువగానే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి” అంటూ చెప్పారు. దిల్ రాజు (Dil raju) కామెంట్స్ తో అతని భార్య తేజస్విని పడి పడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మోసాలు ఉంటాయి..
5 కోట్లతో పూర్తి చేస్తాం అంటారు.. 10 కోట్లు చేస్తారు#DilRajuDreams #DilRaju #VijayDeverakonda pic.twitter.com/1gviLt8uUo— Filmy Focus (@FilmyFocus) June 28, 2025
1996 లో సినిమా ఫీల్డ్ కి వచ్చినప్పుడు.. ఓ వింత సంఘటన జరిగింది
సినిమాలో నటిస్తావా అని అడిగి.. ఒకరోజు మొత్తం కూర్చోబెట్టి ఒక అమ్మాయితో గంట కొట్టే సీన్ తీసి.. మమ్మల్ని బురిడీ కొట్టే ప్రయత్నం చేసారు#DilRajuDreams #DilRaju #VijayDeverakonda pic.twitter.com/HKduZShPvg
— Filmy Focus (@FilmyFocus) June 28, 2025