హీరోలు – ‘అసలు’ పేర్లు

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక టైటిల్ ఉంటుంది. అయితే ఆ టైటిల్ సంగతి పక్కన పెడితే, అసలు మన టాలీవుడ్ హీరోల్లో ఎంతమంది అసలు పేర్లు మనకు తెలుసు? వారిని మనం పిలుచుకునేవే అసలు పేర్లా లేకపోతే వారికి వేరే పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక మరి కొందరు సెలెబ్రెటీస్ అయితే కావాలనే వారి పేర్లను భవిష్యత్తు కోసం మార్చుకుంటూ ఉంటారు. మరి అలా మార్పులు చేర్పులు కలిగి, అసలు పేర్లు మనకు తెలియకుండా, తెలుగు తెరపై పడుతున్న పేర్లతో చెలామణీ అయిపోతున్న వారిలో కొందరిని ఒక లుక్ వేద్దాం రండి…

శివ శంకర వర ప్రసాద్ – చిరంజీవి

మెగాస్టార్ అంటూ అభిమానులు కొలిచే ఆరాధ్య దైవం చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్.

శివరామకృష్ణ – కృష్ణ

సూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలిచుకునే మన కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.

చంద్రశేఖర రావ్ – చంద్రమోహన్

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన మన చంద్ర మోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.

ప్రకాష్ రాయ్ – ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు, న్యాషనల్ అవార్డ్ విన్నర్, ప్రకాష్ రాజ్ అసలు పేరు…ప్రకాష్ రాయ్.

కల్యాణ్ బాబు – పవన్ కల్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసలు పేరు కల్యాణ్ బాబు.

ఘంటా నవీన్ బాబు – నాని

న్యాచురల్ యాక్టర్, టాలీవుడ్ యువ హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు.

భక్తవత్సలమ్ నాయుడు – మోహన్ బాబు

కలెక్షన్ కింగ్, మంచు మూవీస్ అధినేత, శ్రీ విధ్యానికేతన్ స్థాపకులు మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సలమ్ నాయుడు

స్వీటీ – అనుష్క

టాలీవుడ్ టాప్ హీరోయిన్, బ్యూటీ అనుష్క అసలు పేరు స్వీటీ.

విజయ లక్ష్మి – రంభ

బొద్దు భామ రంభ అసలు పేరు విజయ లక్ష్మి.

శోభనా చలపతి రావు – శొభన్ బాబు

టాలీవుడ్ సొగ్గాడు, అందాల నటుడు శొభన్ బాబు అసలు పేరు శోభనా చలపతి రావు.

శ్రీనివాస చక్రవర్తి – జేడీ. చక్రవర్తి

గెడ్డం హీరో, సీనియర్ ఆర్టిస్ట్ జేడీ. చక్రవర్తి అసలు పేరుశ్రీనివాస చక్రవర్తి.

వెంకటబంగారురాజు – కృష్ణ వంశీ

ట్యాలెంటెడ్, వర్సటైల్, డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు వెంకటబంగారురాజు.

సత్తిరాజు లక్ష్మి నారాయణ్ – బాపు

ప్రముఖ చిత్ర కారుడు, సంచలనాల దర్శకుడు, ఖలాఖండాల సృష్టికర్త బాపు గారి అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ.

సుజాత – జయసుధ

సహజ నాటి, అప్పట్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించుకున్న యాక్టర్ జయసుధ గారి అసలు పేరు సుజాత.

లలితారాణి – జయప్రధ

అందాల భామ, బీజేపీ ఎంపీ జయప్రధ అసలు పేరు లలితారాణి.

లతా రెడ్డి – రోజా

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సంచలనం సృష్టించి, ఇప్పుడు నగరి నియోజకవర్గ ఎమెల్యేగా ప్రజాసేవలో తరిస్తున్న వైకాప ఎమెల్యే రోజా అసలు పేరు లతా రెడ్డి.

శ్రీఅమ్మ యంగార్ అయ్యప్పన్ – శ్రీదేవి

టాలీవుడ్ టాప్ హీరోయిన్, తన అందంతో, అభినయంతో చిత్ర పరిశ్రమను షేక్ చేసిన అందాల భామ శ్రీదేవి అసలు పేరు శ్రీఅమ్మ యంగార్ అయ్యప్పన్.

తబస్సుమ్ హాష్మీ – టబూ

అందాల భామ టబూ అసలు పేరు…తబస్సుమ్ హాష్మీ.

సౌమ్య – సౌందర్య

అలనాటి అందాల భామ, చిరునవ్వుల మధురిమ సౌందర్య అసలు పేరు సౌమ్య.

రవి శంకర రాజు భూపతిరాజు – రవితేజ

టాలీవుడ్ టాప్ హీరో, మాస్ మహారాజ రవి తేజ అసలు పేరు రవి శంకర రాజు భూపతిరాజు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus