వరల్డ్ మొత్తంలో చూసుకున్నా.. ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఓ ఫ్లైట్ నేల పై పడినా అందులో ఉన్న 272 మందికి ఎటువంటి హాని కలగలేదు. అందరూ చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళే.బహుశా… లేచిన వేళ మంచిది అని ఇందుకే అంటారేమో..! అయితే అందరూ క్షేమంగా బయటపడడానికి ముఖ్య కారణం ఆ ఫ్లైట్ కెప్టెన్ భల్లా అనే చెప్పాలి.1993 నవంబర్ 15న ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్రాస్ నుండీ హైదరాబాద్ వస్తున్న ఓ ఫ్లైట్ లో 272 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్నింగ్ 6 ఆ టైములో ఆ ఫ్లైట్ హైదరాబాద్ కు పయనమైంది.
ఇందులో 64 మంది సినీ ప్రముఖులు అలాగే వారి కుటుంబ సభ్యులు ఉండడం గమనార్హం. మన టాలీవుడ్ నుండీ చిరంజీవి, బాలక్రిష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, సుధాకర్, బ్రహ్మానందం, కాస్టూమ్స్ కృష్ణ, దర్శకుడు బాపు, కోడి రామకృష్ణ వంటి వారు ఉన్నారు. అయితే అనుకోకుండా విమానం రెక్కలకు ఉండే ప్లాప్స్, స్లాట్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో లాండింగ్ కోసం తెరుచుకోగా, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో లాండింగ్ చేయడం కుదర్లేదు. దీంతో మళ్ళీ ఫ్లై అవ్వాల్సిన టైములో సాంకేతిక లోపం వల్ల వెళ్లడం లేదు. ఇంధనం లోపం కూడా సంభవించింది.
నిజానికి పెద్ద ప్రమాదం జరగడమే కాకుండా ఫైర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్‌రాజ్,తమ నైపుణ్యం మరియు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో విమానాన్ని లాండ్ చేశారు. ఆ లాండింగ్ ఏమాత్రం ముందు జరిగినా ఫ్లైట్ చెరువులో పడేది. లేదంటే కరెంట్ తీగల మీద పడి ఘోర ప్రమాదం సంభవించేది. కానీ భగవంతుడి దయవల్ల ఎవ్వరికీ ఏ హాని జరగలేదు. కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ సంఘటన చాలా భయపెట్టిందనే చెప్పాలి.ఇప్పటికీ దీని గురించి కథలు కథలుగా చెప్పుకుంటారంటే నమ్మండి..!