మరో ప్రయోగంతో వస్తున్న వైవీఎస్‌ చౌదరి హీరో… ఈసారి ఒక్కడే!

ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఇలా అడిగితే గుర్తుకు రావడం కష్టం కానీ.. వైవీఎస్‌ చౌదరి హీరోగా ఆదిత్య ఓం గుర్తున్నాడా? అంటే చాలామందికి ఓ ఐడియా వచ్చేస్తుంది. నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు ఆదిత్య ఓం. వైవీఎస్‌ చౌదరి తెరకెక్కించిన ఆ సినిమా భారీ విజయం అందుకుంది. అందులో అంకిత సరసన నటించి ఆదిత్య మెప్పించాడు కూడా.

ఆ సినిమా తర్వాత ఆదిత్య ఓం కొన్ని సినిమాలు చేసి అవి విజయం సాధించకపోవడంతో సినిమాల్లో చాలా రోజులు కనిపించలేదు. ఆ తర్వాత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ ట్రై చేసినా వర్కవుట్‌ కాలేదు. ఈ క్రమంలో ఆయన ప్రయోగాలవైపు వెళ్లారు. తాజాగా ఆయన చేసిన ఓ ప్రయోగం ‘బందీ’. ఏక పాత్రతో రూపొందిన ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఇందులో ఒక్క పాత్రనే కనిపించడం ప్రత్యేకం.

ఆదిత్య ఓం (Aditya Om) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాల అంతా స్క్రీన్ మీద ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. తెలుగులో సింగిల్ క్యారెక్టర్ సినిమాలు రావడం అరుదు. గతంలో కొన్ని సినిమాలు చేసిన సరైన విజయం అందుకోలేదు. ఈ సినిమాకు ఆదిత్య ఓం కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమా ట్రైలర్‌లో ప్రాణం కోసం మనిషి చేసే పోరాటాన్ని చూపించారు. ‘జీవితం అనేది ఓ పరుగు… ఆహారం కోసం, నీరు కోసం, డబ్బు కోసం, స్వాతంత్య్రం కోసం, కోరికల కోసం’ అంటూ సినిమా కాన్సెప్ట్‌ను ట్రైలర్‌లో చూపించారు.

ఓ అడవిలో ఆహరం కోసం ఆదిత్య ఓం పరుగులు తీయడం ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. ఆకలికి తాళలేక ఆఖరికి చీమల్ని తిన్నట్టు కూడా చూపించారు. ఓ దశలో ప్రాణాల కోసం పరుగులు తీసినట్టు చూడొచ్చు. అంతేకాదు ట్రైలర్ చివర్లో ఆయన ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించారు. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus