సినిమాలు వదిలేసి టాప్ కంపెనీల్లో రాణిస్తున్న తెలుగు హీరోయిన్స్ !

సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువ. గట్టిగా అయితే పదేళ్ళు రాణించగలరు. అంతకు మించి ఉండాలి అంటే.. అక్క, అమ్మ, వదిన వంటి పాత్రలే చెయ్యాల్సి వస్తుంది. అందుకే హీరోయిన్ గా మంచి రెస్పెక్ట్ ఉన్న టైంలోనే రిటైర్ అయిపోవడం బెటర్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశీ చెప్పుకొచ్చారు. ఇదే బాటలో మరికొంత మంది హీరోయిన్లు ఎప్పుడో అడుగులు వేశారు. నాగార్జున, హరికృష్ణ కలిసి నటించిన ‘సీతారామరాజు’ చిత్రంలో వారి చెల్లిగా నటించిన మాన్య అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ తెలుగుతో పాటు.. తమిళ , కన్నడ , మలయాళం భాషల్లో కలిపి 41 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె ‘jp morgan chase’ కంపెనీ లో కీలక బాధ్యతలు స్వీకరించి ముందుకు సాగుతుంది.

ఇక మరో హీరోయిన్ మయూరి కాంగో. మహేష్ బాబు ‘వంశీ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ… తరువాత బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. అవకాశాలు తగ్గిన వెంటనే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్న మయూరి కాంగో… గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను స్వీకరించింది.ఇక వెంకటేష్ తో ‘సుందరాకాండ’ చిత్రంలో నటించిన అపర్ణ …శ్రీకాంత్ అనే ఎన్నారై ను పెళ్ళి చేసుకుని.. అమెరికా లో సెటిల్ అయ్యింది. ఇండియాలో చైల్డ్ సైకాలజీ చదువు చదివిన అపర్ణ.. పెళ్లయ్యాక అమెరికాలో డబల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చుదిద్దుతుంది.

ఇక నితిన్ ‘జయం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన..శ్వేతా యామిని మరే సినిమాలోనూ నటించకుండా… క్యాంపస్ ప్లేసెమెంట్ లో విప్రో కంపెనీ లో జాబ్ కొట్టింది. అటు తర్వాత అమెరికా లో మాస్టర్స్ పూర్తి చేసి…. ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. అటు తర్వాత వివాహం చేసుకుని బిజినెస్ రంగంలోకి కూడా తన అడుగుపెట్టింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus