సిరివెన్నెల సీతారామశాస్త్రికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన ప్రకటించిన సందర్భంగా… తెలుగు చలన చిత్ర (టాలీవుడ్) మీడియా ప్రతినిధులు గురువారం జనవరి 31న సాయంత్రం హోటల్ పార్క్‌హయత్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యి తన అనుభవాలను వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ… “సినీ రంగాన్ని నేను దేవాలయం కంటే ఎక్కువగా ఆరాధిస్తాను.
సినీ సాహిత్యమనే వ్యవసాయంలో నాకు లభించిన ఫలసాయం… పద్మశ్రీ పురస్కారం. పద్మశ్రీ పురస్కారానికి నా పేరు సూచించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు పద్మశ్రీ రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు.. దానికోసం ఎవర్నీ బ్రతిమాలనూ లేదు. అయితే నాకు పద్మశ్రీ రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆకాంక్షించారు… నాకు చాలా ఆనందంగా అనిపించింది.. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటల ప్రస్థానంలో తరచి చూస్తే పదాల కూర్పు, రచయితల శైలి మారినప్పుడే సినీరంగంలో చక్కటి పాటలు వస్తాయి. కేంద్రం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని మాత్రమే ప్రకటించింది.. అయితే పద్మశ్రీ నాకు బిరుదు మాత్రం. అది పేరు ముందు రాయొద్దు అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సభికుల హృదయాలను గెలుచుకోవడం విశేషం.