అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’లో సమంత ఓ ఐటెం సాంగ్లో నర్తించిన సంగతి తెలిసిందే.ఈ పాట బన్నీ అభిమానుల్ని అలాగే మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్లో తెగ ట్రెండ్ అవుతుంది.ఇప్పటివరకు ఈ పాటకి 34 మిలియన్ల వ్యూస్ నమోదవ్వడం విశేషం.నిన్న జరిగిన ‘పుష్ప’ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్..
ఈ ఐటెం సాంగ్ తో భక్తి పాట కూడా వచ్చింది అని చెబుతూ.. ఆ రకంగా ఈ పాటని పాడి బాగా కామెడీ చేసాడు. మొన్నటికి మొన్న ఈ పాట పై పురుషుల సంఘం కోర్టుకెక్కింది. ఇదిలా ఉండగా.. ఈ పాటని పేరడీ చేస్తూ ఓ మేల్ వెర్షన్ కూడా రూపొందింది. ఒరిజినల్ వెర్షన్లో ఉన్న లిరిక్స్నే కొంచెం అటు ఇటు తిప్పి.. ‘‘ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ మార్చేసి పాడారు. ఈ పాటని ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా….
ఈ పాటకి మ్యాచ్ అయ్యేలా ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు క్లిపింగ్స్ ను అటాచ్ చేసారు. ఈ వీడియో క్లిప్ లకి ఆ ఆడియో క్లిప్ కు సరిగ్గా సెట్ అయిపోయింది. అలా సమంత పాటకి పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం,ప్రభాస్ లు సెటైలు వేసినట్టు ఈ వీడియో ఉంది. ఫిమేల్ వెర్షన్ కంటే… మేల్ వెర్షనే బాగుంది అంటూ నెటిజెన్లు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.