Samantha Song: అంతకు మించి అనిపిస్తున్న ‘ఉ అంటావా లేక ఉఊ అంటావా’ మేల్ వెర్షన్..!

  • December 17, 2021 / 09:32 PM IST

అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’లో సమంత ఓ ఐటెం సాంగ్లో నర్తించిన సంగతి తెలిసిందే.ఈ పాట బన్నీ అభిమానుల్ని అలాగే మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది.ఇప్పటివరకు ఈ పాటకి 34 మిలియన్ల వ్యూస్‌ నమోదవ్వడం విశేషం.నిన్న జరిగిన ‘పుష్ప’ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్..

ఈ ఐటెం సాంగ్ తో భక్తి పాట కూడా వచ్చింది అని చెబుతూ.. ఆ రకంగా ఈ పాటని పాడి బాగా కామెడీ చేసాడు. మొన్నటికి మొన్న ఈ పాట పై పురుషుల సంఘం కోర్టుకెక్కింది. ఇదిలా ఉండగా.. ఈ పాటని పేరడీ చేస్తూ ఓ మేల్ వెర్షన్ కూడా రూపొందింది. ఒరిజినల్‌ వెర్షన్‌లో ఉన్న లిరిక్స్‌నే కొంచెం అటు ఇటు తిప్పి.. ‘‘ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ మార్చేసి పాడారు. ఈ పాటని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేయగా….

ఈ పాటకి మ్యాచ్ అయ్యేలా ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు క్లిపింగ్స్ ను అటాచ్ చేసారు. ఈ వీడియో క్లిప్ లకి ఆ ఆడియో క్లిప్ కు సరిగ్గా సెట్ అయిపోయింది. అలా సమంత పాటకి పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం,ప్రభాస్ లు సెటైలు వేసినట్టు ఈ వీడియో ఉంది. ఫిమేల్ వెర్షన్ కంటే… మేల్‌ వెర్షనే బాగుంది అంటూ నెటిజెన్లు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus