మలయాళ రీమేకులపై దృష్టిపెడుతున్న టాలీవుడ్ మేకర్స్

  • July 6, 2020 / 02:30 PM IST

రీమేకులు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. ఒకానొక సందర్భంలో సిసలైన తెలుగు సినిమా కంటే డబ్బింగ్ మరియు రీమేకులకే తెలుగు దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు కూడా అగ్ర తాంబూలం ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. ఈమధ్యకాలంలో తెలుగులో రీమేకుల పరంపర కాస్త ఎక్కువైంది. మరీ ముఖ్యంగా అగ్ర నిర్మాణ సంస్థలు కూడా రీమేకులకే ప్రాధాన్యత ఇస్తుండడం శోచనీయం. దూరపు కొండలు నునుపు అన్నట్లు.. తెలుగులో మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ & రైటర్స్ ను ఎంకరేజ్ చేయకుండా ఇలా మలయాళ చిత్రాల మోజులోపడి మొద్దు నిద్ర నటించడం అనేది శ్రేయస్కరం కాదు.

మలయాళ సినిమాలు బాగుంటాయి, కొన్ని అద్భుతంగా ఉంటాయి. అది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన విషయం. అయితే.. మలయాళ చిత్రాల్లో కంటెంట్ కంటే ఎక్కువగా కనిపించేది నేటివిటీ. “ప్రేమమ్” మొదలుకొని రీసెంట్ గా నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్న “కప్పెల” వరకూ ప్రతి చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించిన అంశం కేరళ పరిసరాలు. ఆ పరిసరాల నడుమ సందర్భాలు. మలయాళ చిత్రాల్లో అద్భుతమైన కథలు ఉండవు.. సగటు మనుషుల జీవితాల్లో రోజూ చూసే పాత్రలు, మనం పేపర్లలో లేదా మన పక్కింట్లో చూసే సందర్భాలు ఉంటాయి.

వారి విజయ రహస్యం కూడా అదే. మన తెలుగు, తమిళ పరిశ్రమలు ఇంకా “లార్జర్ దేన్ లైఫ్ సినిమా” అనే రొచ్చులోనే ఉండిపోయాయి. అందువల్ల తెలుగు సినిమా అనేది జనాలకి బోర్ కొట్టేసి.. ఒటీటీలో కుప్పలుతెప్పలుగా లభ్యమవుతున్న మలయాళ చిత్రాలను వరుసబెట్టి చూసేస్తున్నారు. గుంపులో గోవింద అన్నట్లు.. మన నిర్మాతలు కూడా పోలోమని మలయాళ సినిమాల రీమేక్ రైట్స్ కొనేయడం మొదలెట్టారు. “డ్రైవింగ్ లైసెన్స్, లూసిఫర్, అయ్యప్పనుం కౌశియమ్, హెలెన్, కప్పెల” ఇలా బోలెడు మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో తెలుగు ప్రేక్షకులను, తెలుగు నేటివిటీతో ఆకట్టుకొనే సినిమాలు ఏవి అనేదానికి సమాధానం సదరు సినిమాలు రిలీజ్ అయ్యేవరకు చెప్పలేం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus