సాధారణంగా తెలుగు సినిమాలంటే… తెలుగు పేర్లే ఉంటాయి. ముఖ్యంగా 1960-70 లలో అచ్చ తెలుగు టైటిల్స్ ను మాత్రమే పెట్టేవారు మన దర్శకనిర్మాతలు,హీరోలు. కానీ ట్రెండ్ మారుతున్న కొద్దీ ఇంగ్లీష్ పదాలతో వచ్చే టైటిల్స్ రావడం మొదలైంది. ‘మెకానిక్ అల్లుడు’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఇలా టింగ్లీష్ టైటిల్స్ పెట్టి మెల్ల మెల్లగా అలవాటు చేయడం మొదలుపెట్టారు. అలా అలా ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్ టైటిల్స్ నే పెట్టడం మొదలు అలవాటు చేసేసుకున్నారు.
ఇంగ్లీష్ లో ముఖ్యంగా వన్ లైన్ లతో వచ్చే పేర్లైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి బాగుంటుంది అనుకుంటున్నారేమో. ఇలా రీసెంట్ టైం లో పూర్తిగా ఇంగ్లీష్ పేర్లతో వచ్చిన తెలుగు సినిమాల పేర్లని ఓ లుక్కేద్దాం రండి.