2020.. టాలీవుడ్ కు మరో పెద్ద దెబ్బ కొట్టినట్టే..!

టాలీవుడ్ సినిమాలకు అత్యధిక కల్లెక్షన్లు తెచ్చిపెట్టే సీజన్లు కొన్ని ఉంటాయన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే సినిమాలకు కాసుల వర్షం కురుస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే సుమ్మర్ లో విడుదలయ్యే సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వస్తుంటాయి. అయితే గత 6 ఏళ్ళ నుండీ జూలై లో విడుదలయ్యే.. ఏదో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుండడం విశేషం. అవి ఏమేమి సినిమాలో ఓ లుక్కేద్దాం రండి :

1) దృశ్యం(2014)

శ్రీ ప్రియ డైరెక్షన్లో వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం 2014 జూలై 11న విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో అప్పటి వరకూ ఫ్లాపుల్లో ఉన్న వెంకీ హిట్ ట్రాక్ ఎక్కాడు.

2) బాహుబలి ది బిగినింగ్(2015)

రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం..2015 జూలై 10న విడుదలయ్యి.. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

3) పెళ్లి చూపులు(2016)

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు. 2016 జూలై 29న ఈ చిత్రం విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4) ఫిదా(2017)

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం.. 2017 జూలై 21న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

5) ఆర్.ఎక్స్.100(2018)

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్.. జంటగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేసాడు.2018 జూలై 12 న విడుదలైన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

6) ఇస్మార్ట్ శంకర్(2019)

రామ్ – పూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 2019 జూలై 18న విడుదలయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

అదండీ.. 2014 నుండీ 2019 వరకూ .. జూలై నెల టాలీవుడ్ కు మంచి హిట్లు ఇస్తూ వచ్చింది. కానీ వైరస్ మహమ్మారి దెబ్బకు 2020 లో దెబ్బ పడిందనే చెప్పాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus