రెండు వైపులా పదునున్న కత్తి కులం. ఒక కులానికి సంబంధించిన పేరుతో బిజినెస్ ప్రారంభిస్తే ఆ సామాజిక వర్గానికి వేగంగా కనెక్ట్ అవుతుంది. అదే విధంగా ఇతర కులానికి చెందిన వారు దూరమయ్యే ఆస్కారం ఉంది. అందుకే సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కులం ప్రస్తావన రాకుండా టైటిల్స్ ఫిక్స్ చేస్తుంటారు. కానీ కథ డిమాండ్ బట్టి కొన్నిటికి క్యాస్ట్ పేరు జోడిస్తుంటారు. అయితే ఎవరూ ఊహించనంతగా ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలా క్యాస్ట్ తో క్రేజ్ సృష్టించిన సినిమా టైటిల్స్ పై ఫోకస్..
రెడ్డి సినిమా టైటిల్స్ లో రెడ్డి జోడిస్తే ఆ సినిమాకి పవర్ డబల్ అవుతుంది. బాలకృష్ణ నటించిన సమర సింహ రెడ్డి సినిమా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా అర్జున్ రెడ్డి మరో సారి నిరూపించింది. దీన్ని సృష్టిలో ఉంచుకొని చిరంజీవి తన 151 సినిమాకి సైరా నరసింహ రెడ్డి అనే అటైటిల్ పెట్టుకున్నారు.
నాయుడు పంతం పట్టింపులు, ముద్దు మురిపాలకు నాయుడు పేరుని కవులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే నాయుడు పేరుతో అనేక సినిమాలు వచ్చాయి. పలనాటి బ్రహ్మనాయుడు, నాయుడిగారబ్బాయి, నాయుడు బావ, నరసింహ నాయుడు, నాయుడుగారి కుటుంబం వంటి చిత్రాలు ప్రజల మనసులు దోచుకున్నాయి.
శాస్త్రి తెలుగు రాష్ట్రాల్లో అందరూ బ్రాహ్మణులను గౌరవిస్తారు. పూజించేవారు లేకపోలేదు. అటువంటి కులం పేరుతో
సీమశాస్త్రి సినిమా వచ్చింది. నవ్వులు పూయించి శాస్త్రి ప్రజలందరి మెప్పు అందుకున్నాడు.
రాజు గతంలో రాజుల కథలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ టైటిల్స్ కి రాజు పేరు పెట్టలేదు. ఈ మధ్య కాలంలో
సీతారామరాజు అనే పేరుతో సినిమా వచ్చింది. నాగార్జున, హరికృష్ణ నటించిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది.
చౌదరినందమూరి తారకరామారావు, మోహన్ బాబు.. వీరు ఏ క్యారెక్టర్ పోషిస్తే అది మదిలో ముద్ర పడిపోవాల్సిందే. అప్పుడు జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్ గర్జిస్తే, ఇప్పుడు రాయలసీమ రామన్న చౌదరి గా డైలాగ్ కింగ్ అరిపించారు.
మాల తెలుగు రాష్టాల్లో అతి తక్కువ జనాభా కలిగిన సామజిక వర్గం మాల. ఈ కులం పేరుతో సినిమా తీయడం సాహసం చేయడమే అవుతుంది. అయితే ఆ సాహసానికి కలెక్షన్లతో పాటు, అవార్డులు వరించాయి.