వందల అవార్డులను సొంతం చేసుకున్న మనసా నమహా!

  • June 28, 2022 / 07:48 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించాలని అంటే ప్రస్తుత కాలంలో వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇలా కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం సినిమాపై ఆసక్తితో ఎంతోమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తమలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే దీపక్ రెడ్డి అని యువకుడు తెరకెక్కించిన మనసా నమహా అని ఒక షార్ట్ ఫిలిమ్ ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మొట్టమొదటి గిన్నిస్ రికార్డుకెక్కిన తొలి లఘు చిత్రం కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో విరాజ్, అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ తదితరులు నటించారు. అయితే ఈ లఘుచిత్రాన్ని ఎవరి సపోర్ట్ లేకుండా దీపక్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి రానని అవార్డ్స్ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఏకంగ 513 అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విజయాన్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక పండుగల జరుపుకోవాలి. ఇంత చిన్న వయసులోనే దీపక్ సాధించిన ఈ విజయం రాబోయే తరాల యువ దర్శకులకు అతడే స్పూర్తి అంటూ చిత్రనిర్మాత తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇక ఈ షార్ట్ ఫిలిం ఇప్పటివరకు జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులను గెలుచుకున్న తొలి షార్ట్ ఫిలిమ్ గా సినిమా రికార్డు సొంతం చేసుకుంది.

ఇకపోతే ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఉత్తమ షార్ట్ ఫిలిం టైటిల్ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సిబ్బంది ఈ సినిమాకి సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ షార్ట్ ఫిలిం అందుకున్న ఈ విజయాన్ని ప్రశంసిస్తూ మేజర్ సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్క, హీరో అడవి శేషు, ఈ సినిమా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus