‘తెలుగువాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ… ప్రేమిస్తే గుండెల్లో గుడి కట్టేస్తారు’… చాలామంది నటుల విషయంలో ఇది జరిగింది. జరుగుతూనే ఉంటుంది. అయితే నిజంగా బయట గుడి కట్టిన సందర్భాలు చాలా తక్కువ. తమిళనాడులో అయితే కుష్బూ, నమిత లాంటివాళ్లకు గుడికట్టారు. అయితే హీరోయిన్లు, హీరోల విషయం అభిమానం కొత్తేం కాదు. కానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి గుడి కట్టేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ నటుడు ఎవరో. ఆ అతనే సోనూ సూద్. లాక్‌డౌన్ టైమ్‌లో కష్టం చూసిందే సాయం చేసిన సూపర్ హీరో. అతనికే గుడి కట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం సోనూ సూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాలి నడకన ఇంటికి వెళ్లడానికి బయలుదేరిన , వెళ్లడానికి సిద్ధమవుతున్నవారిని విమానాలు, బస్‌లు, కార్లు, రైళ్లలో వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు, ఆ తర్వాత కూడా ఛారిటీ కొనసాగించాడు. అందుకే ఇప్పుడు అందరూ సోనూసూద్‌ను రియల్ హీరో అంటున్నారు. కొందరైతే దేవుడనే అంటున్నారు.
ఈ క్రమంలో సిద్దిపేటకు దుబ్బతండ వాసులు ఏకంగా సోనూకు గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లా దూల్‌మిట్ట మండలం దుబ్బతండా గ్రామ పంచాయతి పరిధిలోని చెలిమె తండాలో ఈ గుడి ఉంది. జనాలుకు చేస్తున్న సేవతో సోనూ దేవుడు అయ్యాడు. అందుకే మేము ఆయనకు దేవాలయం నిర్మించాం అని నిర్వాహకులు చెబుతున్నారు. సోనూ గుడిలో అభిమానులు, స్థానికుల ఆనందం, సందడి చూస్తుంటే మీకే ఆనందం వేస్తుంది. మరి సోనూకు ఎలా ఉంటుందో మరి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!