హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే కథానాయకుడు మాస్ మహారాజా రవితేజ. ఈయన కథనాయకుడుగా పటాస్, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితమవుతుంది. చిత్రీకరణ పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సాయికార్తీక్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా టైటిల్ ట్రాక్ ఇటీవల విడుదలైంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
“రాజా రాజా ది గ్రేటు రా…
నువ్వు తళ తళ టు థౌంజెండ్ నోటు రా..“ అంటూ సాగే పల్లవి ఎనర్జిటిక్‌గా ఉండటంతో పాటు హీరో క్యారక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసేలా ఉండటం బాగా ప్లస్ అయ్యింది. మంచి ఊపున్న ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్రెడీ విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో పాటు టైటిల్ ట్రాక్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. త్వరలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “సినిమా అవుట్‌పుట్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. మాస్ మాహారాజా రవితేజగారి ఎనర్జీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఆయన డబుల్ ఎనర్జీతో కనపడతాడు. ఇప్పటి వరకు కనపించని సరికొత్త క్యారెక్టర్‌లో రవితేజ కనిపించబోతున్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ సూపర్బ్‌గా కుదిరింది. టైటిల్ ట్రాక్ సాంపిల్ మాత్రమే. మిగతా ట్యూన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. త్వరలోనే పాటలు విడుదలవుతాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా సినిమా అందరినీ అలరించడం ఖాయం“ అన్నారు.