పెళ్ళైన 22 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోబోతున్న విజయ్?

గత రెండు, మూడు రోజులుగా హీరో విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరి మధ్య కొన్నాళ్లుగా మాటలు లేవని, మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి రెడీగా ఉన్నారని రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 22 ఏళ్ళ తర్వాత.. అది కూడా పిల్లలు పెద్దవాళ్ళవుతున్న తరుణంలో ఇలాంటి వార్త పుట్టుకురావడం కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. విజయ్- సంగీత..లది ప్రేమ వివాహం. నిజానికి విదేశాల్లో ఉండే సంగీత.. విజయ్ కు వీరాభిమాని కావడంతో.

ఫ్లైట్ ఎక్కి మరీ విజయ్ ను కలవడానికి వచ్చింది.అతనితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోవాలి అనుకుంది.కానీ ఆ కొద్దిసేపటికే వాళ్ళు ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాంటి ఈ జంట చిన్న చిన్న గొడవలకు విడిపోవడం ఏంటి.. అనే డౌట్ మీకు రావచ్చు. అసలు ఈ వార్తలు ఎందుకు మొదలయ్యాయి అనే విషయానికి వెళ్తే.. ఇటీవల ‘వారిసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ భార్య వెళ్ళలేదు.

అలాగే విజయ్ ఇటీవల వెళ్లిన కొన్ని ఫంక్షన్లకు తన భార్య సంగీత వెళ్ళలేదట. అందుకే విడాకుల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సంగీత తన పిల్లలతో కలిసి అమెరికాకి వెళ్లిందట. అందుకోసమే ఆమె ఎటువంటి ఫంక్షన్లకు హాజరు కాలేకపోయింది అని వారు తెలిపారు. త్వరలోనే ఆమె ఇండియాకి వస్తుందని కూడా వాళ్ళు తెలిపారు. దీంతో ఈ వార్తలు అన్నీ అసత్యాలే అని తేలిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ నటించిన ‘వారసుడు'(వరిసు) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ సినిమా పాటలకు, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. అటు తర్వాత లోకేష్ కనగరాజన్.. దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus