తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) ఆఖరి సినిమాగా హల్ చల్ చేస్తున్న “గోట్”ను (The Greatest of All Time ) దర్శకనిర్మాతల కంటే ఫ్యాన్స్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. తమ హీరో ఆఖరి సినిమా ఇదే అవుతుంది అన్న ఊహ వారికి కొంత బాధ కలిగించిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. సదరు సినిమాను సూపర్ హిట్ గా మలచాలనే ఆరాటం మాత్రం తగ్గడం లేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన “గోట్” (The GOAT) చిత్రం సెప్టెంబర్ 5 రిలీజ్ కి సన్నద్ధమవుతోంది.
ఇప్పటివరకు విడుదలైన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, మొన్న విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా మీద అంచనాలను డబుల్ చేసింది. అయితే.. ఈ చిత్రాన్ని ఎప్పట్లానే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా.. హిందీ వెర్షన్ రిలీజ్ మాత్రం డౌట్ లో పడింది. నిజానికి ఈ చిత్రం హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు. విజయ్ కి నార్త్ మార్కెట్ లో కూడా కాస్తంత పేరున్న విషయం తెలిసిందే.
అయితే.. ట్రైలర్ రిలీజ్ అయితే చేసారు కానీ.. సరిగ్గా 10 రోజులు కూడా లేదు, ఇప్పటివరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదని, కనీసం ముంబైలో “కల్కి” (Kalki 2898 AD) తరహాలో ప్రెస్ మీట్ అయినా పెట్టకపోతే ఎలాగని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన చూస్తుంటే.. హిందీ థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చే అంచనాకి వచ్చేశారు అభిమానులు.
“లియో” (LEO) విషయంలోనూ అలాగే జరిగిందని, “గోట్” విషయంలో మాత్రం అలా చేయొద్దని, తమ హీరో ఆఖరి సినిమాని దేశమంతా రిలీజ్ అయ్యలా చూడాలని దర్శకనిర్మాతలను వేడుకొంటున్నారు. మరి ఈ విషయాన్ని నిర్మాతలు కాస్త పట్టించుకొని ఇప్పటికైనా ప్రమోషనల్ యాక్టివిటీస్ ను సౌత్ తోపాటుగా నార్త్ లోనూ మొదలెడతారో లేక సైలెంట్ గా రిలీజ్ చేసేసి.. రిజల్ట్ బట్టి ప్రమోషన్స్ అంటారో వేచి చూడాలి.