కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి (Thalapathy Vijay) ‘తుపాకీ’ (Thuppakki) నుండి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన ‘జిల్లా’ (Jilla) ‘అదిరింది’ (Mersal) వంటి సినిమాలు ఇక్కడి మాస్ ఆడియన్స్ కి అతన్ని దగ్గర చేశాయి. ఆ తర్వాత ‘సర్కార్’ (Sarkar) ‘బిగిల్’ (Bigil) ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varasudu) ‘లియో’ (LEO) .. ఇలా వరుస సినిమాలతో తెలుగులో అతని మార్కెట్ పెంచుకున్నాడు విజయ్. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. ప్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు నిలకడగా వస్తున్నాయి అతని సినిమాలకి.
‘లియో’ సినిమాకి ప్లాప్ టాకే వచ్చింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.25 కోట్లు షేర్ ని వసూల్ చేసింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ వంటి ఏరియాల్లో విజయ్ సినిమాలు ఎగబడి చూస్తున్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అందుకే అతని లేటెస్ట్ మూవీకి నైజాంలో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ‘గోట్’ (GOAT) అనే సినిమా రూపొందుతుంది.
ఇందులో విజయ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరుగుతుంది. ఒక్క నైజాంలోనే ‘గోట్’ చిత్రానికి రూ.8 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంత మొత్తాన్ని చెల్లించి ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ ‘గోట్’ సినిమాను విడుదల చేస్తుందట. ఒక్క నైజాంకే అంత పెడితే.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఏర్పడింది.