GOAT: ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబరులో విజయ్‌ సినిమా… ఏంటి లెక్క?

విజయ్‌ (Vijay) సెమీ ఫైనల్‌ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ (The Greatest of All Time) రిలీజ్‌ డేట్‌ను టీమ్‌ ఫిక్స్‌ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను టీమ్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమా విజయ్‌ కెరీర్‌లో గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనట్లు సెప్టెంబరులో విడుదల కాబోతోంది. అవును, ఈ సినిమాను సెప్టెంబరు 5న రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఆ డేట్‌ను స్పెషల్‌గా విజయ్‌ ఎందుకు ఓకే చేశాడు అనే చర్చ మొదలైంది.

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ బరిలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో రెండు సినిమాలు మాత్రమే చేస్తారు అని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ సినిమాను సెమీ ఫైనల్‌ అనొచ్చు. ఫైనల్‌ ఏంటి అనేది ఆఖరున చెబుతాం. ఇక ‘గోట్‌’ సంగతి చూస్తే… ఈ బహుభాషా చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరికొచ్చింది అని చెబుతున్నారు.

అందుకే సెప్టెంబరు 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించేసింది. ఆ పోస్టర్‌లో విజయ్‌ కళ్లద్దాలు పెట్టుకుని నెరిసిన జుట్టు, గడ్డంతో సీరియస్‌గా చూస్తూ కనిపించాడు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కొడుకు పాత్ర కోసం డీఏజినింగ్‌ టెక్నాలజీ వాడి యువకుడిగా చూపిస్తారట. ఇక మే చివరి నాటికి సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు.

ఇందాక ఫైనల్‌ అని చెప్పాం కదా… ఆ సినిమానే హెచ్‌.వినోద్‌తో (H. Vinoth) చేయబోయే చిత్రం. ఇటీవల ఓకే అయిన ఈ సినిమా నిర్మాణ సంస్థను తేల్చుకునే క్రమంలో ఉందట. త్వరలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అవుతుంది అంటున్నారు. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత విజయ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చేస్తాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus