Jason Sanjay: విజయ్ కొడుకు డైరెక్షన్లో సందీప్ కిషన్ సినిమా.. జరిగే పనేనా..!

తమిళ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) .. మన తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..లానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2026 లో జరిగే ఎన్నికల టైంకి తాను కమిట్ అయిన సినిమాలు ఫినిష్ చేయాలి అనేది అతని మోటో. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడానికి అతనికి డబ్బులు కావాలి. సో విజయ్ వీరాభిమానులంతా విజయ్ కొడుకు డెబ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చూడటానికి అతను చక్కగా ఉంటాడు.

Jason Sanjay

సో నవ దళపతి అతనే అని అభిమానులంతా భావిస్తున్నారు. ఇలాంటి టైంలో విజయ్ అభిమానులకు మాత్రమే కాదు యావత్ సినీ అభిమానులకు పెద్ద ఝలక్ ఇచ్చింది ఓ వార్త. అదేంటంటే.,. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay)  డైరెక్టర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనే ఓ గాసిప్ ఇప్పుడు మొదలైంది. ఇది తెలిసినప్పటి నుండి విజయ్ అభిమానులు… ఇది నిజమా కాదా అనే అయోమయంలో పడ్డారు. ఓ స్టార్ హీరో కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం ఏంటి అని అంతా అనుకుంటున్నారు.

ఇందులో నిజానిజాలు గురించి ఆరా తీయగా.. ‘ఇది వంద శాతం నిజమే’ అని తేలింది. జాసన్ సంజయ్.. నటనలోనే కాకుండా డైరెక్షన్లో కూడా శిక్షణ తీసుకున్నాడట. అతనికి రైటింగ్ పై మంచి పట్టు ఉంది. దీంతో ‘లైకా సంస్థ’ అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక జాసన్ సంజయ్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్నాడట. జాసన్ (Jason Sanjay) చెప్పిన కథ సందీప్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడట.

సందీప్ కి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ‘రాయన్’ (Raayan) తో అది మరింత బలపడింది. ఈ ప్రాజెక్టుకి తమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే జాసన్ విజయ్ భవిష్యత్తులో డైరెక్టర్ గానే కంటిన్యూ అవుతాడా లేక హీరోగా మారి సినిమాలు చేస్తాడా? అంటే కచ్చితంగా హీరోగా కూడా సినిమాలు చేస్తాడట. ప్రస్తుతానికి తనకి బాగా ఇష్టమైన డైరెక్షన్ ముచ్చట తీర్చుకుంటున్నట్టు తెలుస్తుంది.

యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus