టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ప్రస్తుతం చేతినిండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా ఈ ట్రైలర్ బీజీఎంకు బ్రో మూవీకి లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రో మూవీ బీజీఎం ఎలా ఉందో భగవంత్ కేసరి ట్రైలర్ లో కొన్ని షాట్స్ బీజీఎం అదే విధంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. థమన్ ప్రతి సినిమా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
స్కంద మూవీకి రీ రికార్డింగ్ విషయంలో థమన్ విమర్శలు ఎదుర్కొంటూ ఉండ్తం హాట్ టాపిక్ అవుతోంది. థమన్ కు గతంతో పోల్చి చూస్తే కొంతమేర ఆఫర్లు తగ్గుతున్నాయి. అనిరుధ్, అబ్దుల్ వాహిద్ హవా తెలుగులో అంతకంతకూ పెరుగుతోంది. భగవంత్ కేసరి, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ సినిమాల కమర్షియల్ ఫలితాలపైనే థమన్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
థమన్ పారితోషికం ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. థమన్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి. థమన్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో సైతం థమన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదని సమాచారం.
థమన్ (Thaman) వర్క్ పై కరెక్ట్ గా దృష్టి పెడితే ఆఫర్లు పెరగడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వర్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థమన్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. థమన్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. థమన్ గతంలో చాలామంది స్టార్ హీరోలకు హిట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు. థమన్ రేంజ్ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. థమన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.