Thaman, Balakrishna: బాలయ్య మాగ్నెట్ లా లాగేసుకుంటున్నారు.. థమన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ వీరసింహారెడ్డి సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. బాలయ్య సినిమాలు అంటే థమన్ మరింత శ్రద్ధతో పని చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు థమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో థమన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య మూవీ విడుదలైతే 70ఎం.ఎంలో చూడాలని భావిస్తారని

నిజానికి బాలకృష్ణే 70ఎం.ఎం అని థమన్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ సినిమాలకు మ్యూజిక్ అందించాలంటే మా కీబోర్డులు చాలడం లేదంటూ థమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య మా మ్యూజిక్ ను అయస్కాంతంలా లాగేసుకుంటున్నారని థమన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ యాక్టింగ్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటుందని థమన్ పేర్కొన్నారు. అఖండ సినిమా విషయంలో అదే జరిగిందని వీరసింహారెడ్డి సినిమా విషయంలో అదే జరిగిందని థమన్ వెల్లడించారు.

థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలు థమన్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీకి, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

థమన్ కు ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కొంతమంది స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలలో థమన్ కు వరుసగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తున్నారు. థమన్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య థమన్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus