Thaman: ఓజీ మూవీ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.. జరగబోయేది ఇదేనంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ విషయంలో, బీజీఎం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు థమన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. థమన్ తప్పేం లేకపోయినా ఆయన గురించి సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరుగుతోంది. గుంటూరు కారం సినిమా నుంచి థమన్ ను తప్పించారని థమన్ స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే థమన్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

తాను కావాలని ఏ సినిమాకు అన్యాయం చేయాలని భావించనని థమన్ పేర్కొన్నారు. ఒక పాట తయారు కావడం వెనుక వేర్వేరు ఫ్యాక్టర్లు ఉంటాయని థమన్ వెల్లడించారు. హీరో ఇమేజ్, లిరిక్స్, డైరెక్టర్ ఇన్ పుట్, మ్యూజిక్ డైరెక్టర్ సృజన పాట పుట్టుకలో కీ రోల్ ప్లే చేస్తాయని థమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతకు మించి అనే డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ఓజి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని (Thaman) థమన్ చెప్పుకొచ్చారు.

ఓజి సినిమాకు ఎంత ఇచ్చినా ఇంకా అవసరం అనే స్థాయిలో ఆ సినిమా ఉంటుందని థమన్ కామెంట్లు చేశారు. తన కామెంట్లతో ఓజీ సినిమాపై థమన్ అంచనాలను పెంచేశారు. ఓజీ సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఓజీ సినిమాకు దానయ్య నిర్మాత కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా వచ్చిన లాభాలతో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

బ్రో, ఓజీ సినిమాలతో పవన్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని పొలిటికల్ గా కూడా పవన్ కు అనుకూల ఫలితాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus