టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తమన్ అంటే ఓ బ్రాండ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గూస్‌బంప్స్ తెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. ‘అల వైకుంఠపురములో’, ‘అఖండ’ లాంటి ఆల్బమ్స్ ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ బార్డర్ దాటితే మాత్రం తమన్ మ్యాజిక్ ఎందుకో వర్కవుట్ కావడం లేదు. ఇక్కడ ఎంత వినిపిస్తున్నా, నార్త్ ఆడియన్స్ ప్లేలిస్ట్‌లో మాత్రం తమన్ పాటలు చేరడం లేదు. పాన్ ఇండియా స్టార్‌డమ్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇంకా కొలిక్కి రావడం లేదు.
THAMAN
నిజానికి రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ చేంజర్’తో తన జాతకం మారుతుందని తమన్ గట్టిగా నమ్మాడు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆల్బమ్ నేషనల్ లెవల్‌లో మోత మోగించడం అటుంచి, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ‘జరగండి’ వంటి పాటలు ఘోరంగా విఫలమయ్యాయి. చేతికి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అలా చేజారిపోయింది.
మరోవైపు పోటీ చూస్తే భయపెట్టేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ‘పుష్ప’తో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసి, తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నాడు. ఇక అనిరుధ్ అయితే ‘జవాన్’తో బాలీవుడ్‌ని షేక్ చేసి, ఇప్పుడు ఇండియా మొత్తం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. వీరితో పోలిస్తే, అత్యధిక సినిమాలు చేస్తున్నా కూడా తమన్ ఇంకా రీజినల్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే మిగిలిపోయాడనే విమర్శ ఉంది.
ఇప్పుడు తమన్ ముందున్న ఏకైక ఆశ కింగ్ సైజ్ ప్రాజెక్ట్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమానే. గతంలో జరిగిన డ్యామేజ్‌ని కవర్ చేసుకోవాలంటే, ఈ సినిమా ఆల్బమ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా ఇందులో ప్లాన్ చేసిన ‘జాతర సాంగ్’ మీదే తమన్ ఆశలన్నీ ఉన్నాయి. ఇది కేవలం మాస్ సాంగ్ లా కాకుండా, దేశం మొత్తం వైబ్ అయ్యేలా ఉంటేనే తమన్ లెవెల్ మారుతుంది. ఈ సినిమా ప్రభాస్ హిట్ కోసం ఎంత ముఖ్యమో తెలియదు కానీ, తమన్ కెరీర్‌కి మాత్రం చాలా కీలకం. ఇది కేవలం సినిమా కాదు, తమన్ ప్రతిభకు ఒక పెద్ద పరీక్ష. మరి ఈసారైనా ఆ ‘పాన్ ఇండియా’ కలను తమన్ నిజం చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.