Thaman Family: భార్యతో స్టేజి పంచుకోవాలని ఉంది అంటున్న తమన్..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన తమన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమాకైనా అతన్నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉండగా.. తమన్ వయసు ఇప్పుడు 38 ఏళ్ళు. కానీ అతనో చిన్న పిల్లాడిలా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇతనికి పెళ్ళై 14ఏళ్ళ కొడుకున్నాడు అనే విషయాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచాడు తమన్.

ఈ విషయాన్ని ఓ సందర్భంలో సాయి ధరమ్ తేజ్, అఖిల్ వంటి యంగ్ హీరోలు బయటపెట్టారు. తమన్ భార్య పేరు శ్రీ వర్దిని. ఈమె ఓ ప్లే బ్యాక్ సింగర్. గతంలో మణిశర్మ, యువన్ శంకర్ రాజా వంటి సంగీత దర్శకులు పని చేసిన సినిమాలకి పాటలు పాడింది. తమన్ సంగీతంలో కూడా 4 పాటలు పాడింది. అయితే తన భార్యా , పిల్లాడి గురించి మొదటి సారి తమన్ నోరు విప్పాడు.

తమన్ మాట్లాడుతూ.. “వర్ధిని వాయిస్ బాగుంటుందని దర్శకనిర్మాతలకి అనిపిస్తే పాడిస్తారు. ఫ్యూచర్లో ఆమెతో కలిసి స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. కానీ ముందుగా ఆమె రెండు,మూడు సూపర్‌ హిట్ పాటలు పాడుండాలి.ఇక నా ‘నేను కంపోజ్ చేసే ట్యూన్‌లను విని తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు.

నాకు మొదటి క్రిటిక్ అతనే.అలాగే మ్యూజిక్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడటంలో కూడా తనకి మంచి పట్టు ఉంది. పియానోలో 4వ గ్రేడ్‌ కంప్లీట్ చేశాడు. అతను కూడా నాలా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా అంటే నాకు తెలీదు. అతను ఏ వృత్తి ఎంచుకుంటాడో అది అతని ఇష్టం’ అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus