ఒకప్పుడు తమన్ పై కాపీ విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ప్రతీ సంగీత దర్శకుడి పై వస్తున్నాయి లెండి. అయితే సోషల్ మీడియా వాడకం అంతంత మాత్రంగా ఉండే రోజుల్లో కూడా తమన్ మ్యూజిక్ పై విమర్శలు గుప్పించేవారు ప్రేక్షకులు. అయితే గత 3ఏళ్ళుగా తమన్ లో చాలా మార్పు కనిపించింది. అతను మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ముఖ్యంగా అతను సినిమాలకి అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి అనే చెప్పాలి. అది మిడ్ రేంజ్ సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. రఫ్ఫాడించేస్తున్నాడు అంతే..! అయితే ఇప్పటివరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఏ ఏ సినిమాలకి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడో ఓ లుక్కేద్దాం రండి :
1) బిజినెస్మెన్ :
మహేష్- పూరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి తమన్ సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. హీరో ఇంట్రో సీన్ దగ్గర్నుండీ ఎండ్ కార్డు టైటిల్స్ పడేవరకు రఫ్ఫాడించేసాడు తమన్.
2) సరైనోడు :
బోయపాటి- బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మాస్ బొమ్మ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలెట్ అని చెప్పాలి.
3) తొలిప్రేమ :
క్లాస్ మూవీనే..! కానీ ఈ సినిమాకి తమన్ అందించిన బిజియం కానీ పాటలు కానీ సూపర్ హిట్ అంతే..!
4) భాగమతి :
అయ్య బాబోయ్ ఈ సినిమాకి ఓ హార్రర్ ఫీలింగ్ ను కలిగించింది తమన్ అన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి.
5) అరవింద సమేత :
ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి తమన్ అందించిన బిజిఎం గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది.
6) అల వైకుంఠపురములో :
బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి కూడా సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు తమన్.
7) క్రాక్ :
ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.
8) వకీల్ సాబ్ :
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కు మరింత జోష్ అందించిందనే చెప్పాలి.
9) అఖండ :
బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ అందించిన బిజిఎం నెక్స్ట్ లెవెల్ అంతే..!
10) భీమ్లా నాయక్ :
పవన్-రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి కూడా తమన్ అందించిన బిజిఎం అదిపోయిందనే చెప్పాలి.
11) రాధే శ్యామ్ :
ప్రభాస్ నటించిన ఈ మూవీకి తమన్ అందించిన బి.జి.యం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఒక లవ్ స్టోరీకి కూడా ఈ రేంజ్ బిజిఎం ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.