టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల సంఖ్య పరంగా థమన్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. సర్కారు వారి పాట, అఖండ, భీమ్లా నాయక్ సినిమాలతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రభాస్ మినహా అందరు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
థమన్ బీజీఎం వల్లే హిట్టైన సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక సందర్భంలో రెమ్యునరేషన్ గురించి స్పందించిన థమన్ సినిమాలపై తన మ్యూజిక్ ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత మొత్తంలో డబ్బు ఇవ్వాలో నిర్మాతలకు తెలుసని అన్నారు. సినిమాలకు తన మ్యూజిక్ వర్కౌట్ కాని పక్షంలో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఫూల్స్ కాదని థమన్ షాకింగ్ కామెంట్లు చేశారు. డిమాండ్ కు తగిన విధంగా సరిపోయే డబ్బును తాను ఆశిస్తానని థమన్ చెప్పుకొచ్చారు.
అయితే థమన్ కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నా ఆ రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తం సింగర్స్, సౌండ్ ఇంజనీర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్ కోసం ఖర్చు చేస్తారు. థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ థమన్ బిజీగా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను ఇస్తూ థమన్ ప్రేక్షకుల్లో సినిమాలపై అంచనాలను పెంచుతున్నారు
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?