ప్రస్తుత కాలంలో ఎలాంటి పెద్ద సినిమాకు అయినా మ్యూజిక్, బీజీఎం ముఖ్యం అనే సంగతి తెలిసిందే. మ్యూజిక్, బీజీఎం సరిగ్గా లేకపోవడం వల్ల సినిమాలు ఫ్లాపైన సందర్భాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న థమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మ్యాటర్ ఉంటే మాత్రమే బీజీఎం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.మంచి సన్నివేశాన్ని మనం చెడగొట్టమని మంచి సీన్ ఉంటే బీజీఎంతో మనం బాగా ఎలివేట్ చేస్తామని థమన్ కామెంట్లు చేశారు.
అక్కడ సీన్ లో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వర్కౌట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఏం చేసినా ఏం మార్పు ఉండదని థమన్ వెల్లడించారు. చచ్చిన శవాన్ని తీసుకొచ్చి బ్రతికించమంటే ఎలా అని ఆయన కామెంట్లు చేశారు.అంతే లాజిక్ ఇక్కడ అని థమన్ తెలిపారు. రివ్యూలు ఇష్టానికి రాస్తారని బీజీఎం అంటారు కానీ అక్కడ సీన్ అద్భుతంగా లేదంటే ఏం చేయగలమని ఆయన ప్రశ్నించారు. మంచి సన్నివేశాన్ని మనం చెడగొట్టబోమని థమన్ పేర్కొన్నారు. థమన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. థమన్ కు భాషతో సంబంధం లేకుండా పాపులారిటీ పెరుగుతోంది.
బాలయ్య థమన్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది. థమన్(Thaman) చేసిన కామెంట్లు ఒక దర్శకునికి కౌంటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థమన్ వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో థమన్ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. థమన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. థమన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!