Thaman: మళ్లీ ముఖానికి రంగేసుకోనున్న తమన్… ఆ యువ హీరోతో కలసి..!
- January 30, 2025 / 01:45 PM ISTByFilmy Focus Desk
తమన్‌లో (Thaman) ఓ యాక్టర్ ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఆయన సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమవ్వడానికి ముందే ఆయన నటుడిగా కనిపించాడు. ఆ సినిమానే ‘బాయ్స్’ (Boys). శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా సాధించిన విజయం, అందులో తమన్ పాత్రకు వచ్చిన స్పందన గురించి ఎవరూ మరచిపోలేదరు. అయితే ఆ తర్వాత తమన్ మళ్లీ ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే 23 ఏళ్లకు మళ్లీ తమన్‌కు నటించాలని అనిపించిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
Thaman

ప్రస్తుతం సౌత్ సినిమాలో టాప్ సంగీత దర్శకుడిగా ఉన్న తమన్.. ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అవుతున్నారట. తమిళంలో ఆకాష్ భాస్కరన్ డెబ్యూ దర్శకుడిగా అథర్వ మురళి ( Atharvaa) హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో తమన్ నటిస్తున్నాడు అని అంటున్నారు. మమిత బైజు (Mamitha Baiju)హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్ పాత్రకు సంబంధించి త్వరలో ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.

కొత్త తరహా కంటెంట్‌తో తెరకెక్కుతుంది అని చెబుతున్న ఈ సినిమాలో అధర్వ మురళి, తమన్ స్నహితుల్లా కనిపిస్తారు అని అంటున్నారు. అందులో తమన్ పాత్ర మ్యూజిషియన్ అని చెబుతున్నారు. అందుకే ఆ పాత్రకు ఆయన్ను ఎంచుకున్నారు అని చెబుతున్నారు. మరి ఆ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. అన్నట్లు ఈ పాత్ర చిత్రీకరణ కూడా జరిగింది అని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా తమనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గతంలో ఇలాంటి పాత్రలు చేయడంలో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) ముందుడేవారు. ఆయన నటించిన పాత్రల్లో చాలా వరకు ఇలానే ఉంటూ వచ్చాయి. ఇప్పుడు తమన్ ఆ స్టైల్‌లో నటనలోకి మళ్లీ వస్తున్నాడు. మరి ఈ కెరీర్‌ను కంటిన్యూ చేస్తాడా? లేక ఏదో సరదాగా ఈ సినిమా చేస్తున్నాడా అనేది చూడాలి. ఇక తమన్ సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో ‘అఖండ 2’, ‘ఓజీ’ (OG) లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా పెద్ద సినిమాలు వరుసగా ఓకే చేస్తూ వస్తున్నారు.















