ప్రభాస్ తెలుగు మార్కెట్ పై శ్రద్ధ పెట్టకుంటే చాలా కష్టం…!

  • July 4, 2022 / 07:43 PM IST

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి 2’ తర్వాత అతని మార్కెట్ బాగా పెరిగింది. ఆ ఒక్క సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ హీరో అయిపోయాడు ప్రభాస్. ఇండియాలో తొలి వెయ్యి కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించిన మూవీ అది. ఓ రకంగా మార్కెట్ పెరిగింది అంటే ఏ హీరో అయినా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి రామ్ నే తీసుకుంటే..

‘ఇస్మార్ట్ శంకర్’ తో అతని రేంజ్ పెరిగింది అని గమనించి లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలను పక్కన పెట్టి ‘రెడ్’ ‘ది వారియర్’, బోయపాటి తో మూవీని సెట్ చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.కానీ ప్రభాస్ మాత్రం అతని ఇమేజ్ కు తగ్గ కథల్ని, సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు. ‘బాహుబలి’ కి ముందు ఎలా అయితే ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు చేశాడో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు.

‘సాహో’ ‘రాధే శ్యామ్’ సినిమాలను కనుక గమనిస్తే అందులో తెలుగు నేటివిటీ మిస్ అయ్యింది. పైగా భారీ బడ్జెట్ తో ఆ చిత్రాలను రూపొందించారు దర్శకనిర్మాతలు. ఎంత ఎక్కువ బడ్జెట్ పెడితే అంత పెద్ద సినిమా అన్నట్టు ప్రభాస్ తో సినిమాలు చేసే దర్శకులు భావిస్తుండటం మరింత విచారించదగ్గ విషయం. ఇక అసలు మేటర్ ఏంటి.. ప్రభాస్ తెలుగు మార్కెట్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడింది. ‘ఆది పురుష్’ చిత్రానికి తెలుగులో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు అని వినికిడి.

ఫస్ట్ లుక్ కూడా అందుకే రిలీజ్ చేయలేదట. ఒక్క కన్నడలో తప్ప ‘ఆదిపురుష్’ బిజినెస్ ఎక్కడా నిర్మాతలు అనుకున్న రేటు పలకడం లేదట. దర్శకుడు ఓం రౌత్ తెలుగు ప్రేక్షకులకి తెలియదు. పైగా ఇలాంటి భక్తిరస చిత్రాలు చూడడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా లేరు. అందుకే ‘ఆది పురుష్’ నిర్మాతలు చెప్పిన రేట్లకి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పటికే ఈ చిత్రానికి రూ.300 కి పైగా బడ్జెట్ పెట్టారట.

మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న హిందీ ‘ఛత్రపతి’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. హిందీలో ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పటివరకు నిర్మాత పెట్టిన పెట్టుబడికి బిజినెస్ ఏమాత్రం స్టార్ట్ అవ్వలేదు అని వినికిడి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus