అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో, హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత వచ్చిన ‘తండేల్’ (Thandel) సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. కొత్త సినిమాలు వచ్చినా ‘తండేల్’ ఊపు తగ్గలేదు. రెండో వారం కూడా డీసెంట్ షేర్స్ రాబట్టింది. మూడో వీకెండ్లో కూడా ఎక్కువ థియేటర్లలో అందుబాటులో ఉంది ‘తండేల్’. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి వసూళ్లు సాధించింది.
‘తండేల్’ చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.50.03 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.14.03 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. గ్రాస్ పరంగా రూ.88.04 కోట్లు కొల్లగొట్టింది. నాగ చైతన్య కెరీర్లో ఇది తొలి రూ.50 కోట్ల షేర్ మూవీ కావడం విశేషం.