ఓటీటీల హవా పెరిగిన థియేటర్ బిజినెస్ కి ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో… వర్క్ ఫ్రం హోమ్..లు పెరిగిన తర్వాత శాటిలైట్ బిజినెస్ కి కూడా అలాంటి ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పాలి. వర్క్ ఫ్రం హోమ్ వంటివి పెరిగిన తర్వాత చాలా మంది ఇంటర్నెట్ కనెక్షన్స్ పెట్టించుకున్నారు. వాటితో చాలా ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేశారు. మెల్లగా వాటికి అలవాటు పడిన తర్వాత కేబుల్ లేదా డిష్ సబ్ స్క్రిప్షన్..లు తీసుకోవడం ఆపేస్తున్నారు జనాలు.
గ్రామాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అందువల్ల ఒకప్పటిలా శాటిలైట్ ఛానల్స్ కి టీఆర్పీ రేటింగ్స్ నమోదు కావడం లేదు. ఇలా శాటిలైట్ బిజినెస్ చాలా దెబ్బతింది. పాన్ ఇండియా సినిమాలను సైతం కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి శాటిలైట్ సంస్థలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అవి షేరింగ్ బేస్ పై తీసుకున్నప్పటికీ వాటికి మంచి రేటింగులు రావడం లేదు.
కానీ అప్పుడప్పుడు కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు మంచి టీఆర్పీ రేటింగులు నమోదు చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ ఏడాది చూసుకుంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి మంచి టీఆర్పీ రేటింగులు నమోదైంది. 16 రేటింగ్ వరకు ఆ సినిమాకి టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత దాని స్థాయిలో ఏ సినిమా కూడా రాణించలేదు.
అయితే జూన్ 29న జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ‘తండేల్’ సినిమాకి మాత్రం మంచి 10.32 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు టీవీల్లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.