నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా తండేల్ (Thandel) . సంక్రాంతి హడావుడి తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు చేసే సినిమా రాకపోవడంతో, ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టి మొత్తం తండేల్ మీదే ఉంది. అయితే ఈ సినిమా అందుకోవాల్సిన ఛాలెంజ్‌లు కొన్ని ఉన్నాయి. మొదటిది, నాగ చైతన్యకు ఎప్పటి నుంచో అవసరమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం. థాంక్యూ, కస్టడీ సినిమాలు నిరాశపరిచాయి.
అలాగే గీతా ఆర్ట్స్‌పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. తండేల్ కోసం అల్లు అరవింద్ (Allu Aravind) భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టడం విశేషం. మీడియం రేంజ్ హీరో కోసం ఇంత ఇన్వెస్ట్‌మెంట్ అరుదు. కానీ కథ మీద కచ్చితమైన నమ్మకం ఉండటంతో మేకర్స్ వెనుకడుగు వేయలేదు. ప్రమోషన్లలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు దర్శకుడు చందూ మొండేటికి (Chandoo Mondeti) మరో సక్సెస్ అవసరం.
కార్తికేయ 2తో (Karthikeya 2) పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ, ఇప్పుడు అదే ఇమేజ్‌ను కొనసాగించాల్సిన బాధ్యతను భుజాలపై పెట్టుకున్నాడు. కథాపరంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడం సవాలే. కానీ ఇది ఆయనకు మరో బిగ్ హిట్ అందిస్తే, టాప్ లీగ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కి (Devi Sri Prasad) కూడా ఈ సినిమా హిట్ అవసరం. పుష్ప 2తో (Pushpa2) మళ్లీ టాప్ ఫామ్ తెచ్చుకున్నప్పటికీ, BGM విషయంలో ఇతరుల జోక్యం ఉండటం అతనికి అసంతృప్తిగా మారింది.
ఈసారి తన సత్తా ఏంటో చూపించేందుకు తండేల్ మంచి అవకాశం. సాయిపల్లవి విషయానికి వస్తే, ఆమె ఇప్పటికే క్రౌడ్ పుల్లర్. నటన, డాన్స్ పరంగా చైతూతో పోటీగా నిలవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తండేల్ ఈ ఛాలెంజ్‌లను అధిగమిస్తే ఫిబ్రవరి నెలను బాక్సాఫీస్ దిశగా ఓ కొత్త రికార్డ్‌తో ప్రారంభించే చాన్స్ ఉంది. మరి ఈ ఛాలెంజ్‌లను దాటుకుంటూ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి.