ఆ హీరోకి ఈ మార్పు మంచికేనా!

  • November 4, 2017 / 10:58 AM IST

ఆ యంగ్ స్టార్ హీరోకి దాదాపు డజను ఫ్లాపుల తర్వాత రెండు హిట్స్ వచ్చాయి. కట్ చేస్తే.. మళ్ళీ వరుసబెట్టి మూడు ఫ్లాపులు, మళ్ళీ ఓ సూపర్ హిట్ కొట్టాడు అని సంతోషపడేలోపే మరో ఫ్లాప్ తో కెరీర్ కష్టాల్లో పడింది. అయితే.. ఇదంతా తన ప్లానింగ్ వల్లనో లేక మరో రీజన్ అనో అనుకొంటే వేరేలా ఉండేదేమో కానీ.. ఆ యంగ్ స్టార్ హీరో తన మేనేజర్ కి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వెంటనే తన మేనేజర్ ను పీకి పడేశాడట.

ఆ యంగ్ హీరోకి మాత్రమే కాక మరికొంత మంది హీరోయిన్స్ మరియు స్టార్ హీరోస్ కి కూడా మేనేజ్ మెంట్ చేస్తున్న మన మేనేజర్ మాత్రం ఈ హటాత్పరిణామానికి షాకయ్యాడట. “నీకు సినిమాలు రాకపోతే నేనేం చేసేది?” అని ప్రశ్నించాడట కూడా. ఈ విషయంలో ఇద్దరి మధ్య దాదాపు చిన్నసైజు గొడవ/వాదన చోటు చేసుకొన్నాయట. మొత్తానికి ఇద్దరూ ఎకౌంట్స్ సెటిల్ చేసుకొని వేరైపోయారట. మరి మేనేజర్ ను మార్చినతర్వాత మన యంగ్ స్టార్ హీరో కెరీర్ ఏమేరకు సెట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus